HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ పిటిషన్
Shiva Balakrishna: 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ
Shiva Balakrishna: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయి, జైల్లో ఉన్న HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అధికారులు.10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు ఏసీబీ అధికారులు. కస్టడీ పిటిషన్‌పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. అక్రమాస్తులు కూడబెట్టిన బాలకృష్ణను విచారిస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇక బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిపై ఆరా తీయనుంది ఏసీబీ.
ఇన్‌ఫ్రా కంపెనీలు, అధికారులు, బంధువులతో జరిగినపై లావాదేవీలపై ఏసీబీ దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే భారీగా బినామీ ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్టు రిలీజ్ చేసింది. అటు బినామీ ఆస్తుల వ్యక్తులనుకూడా విచారించాల్సి ఉందని పిటిషన్‌లో తెలిపింది ఏసీబీ. మరో వైపై బ్యాంకులాకర్లు, ల్యాండ్ డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. బాలకృష్ణతో పాటు పలువురిని విచారించనుంది ఏసీబీ. అయితే ఈ కేసులో మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.