Cheetah: మియాపూర్ వాసులకు అలర్ట్..మెట్రో స్టేషన్ వెనక చిరుత కలకలం
Cheetah At Miyapur Metro Station In Hyderabad: హైదరాబాద్ చిరుత కలకలం రేపుతోంది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల చిరుతను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అటవీ అధికారుల సహాయంతో చిరుతను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Cheetah: హైదరాబాద్ చిరుత కలకలం రేపుతోంది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల చిరుతను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అటవీ అధికారుల సహాయంతో చిరుతను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
మియాపూర్ పరిధిలో ఉండే వారికి బిగ్ అలర్ట్. ఎందుకంటే మీరు ఉంటున్న ఏరియాలో చిరుతపులి సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక కొంతమంది చిరుతపులిని చూశారు. స్టేషన్ వెనక జరుగుతున్న నిర్మాణాల కోసం వచ్చిన కూలీలు చిరుతను చూశారని చెబుతున్నారు.
చిరుత నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను వీడియో తీసి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు చిరుతపులిని గాలించే పనిలో ఉన్నారు. మరోవైపు మియాపూర్ మెట్రో వెనకున్న చంద్రనాయక్ తండావాసులతో పాటు చుట్టుపక్కల కాలనీ వాసులను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని బయటకు రావద్దంటూ పోలీసులు హెచ్చరించారు.
అయితే వికారాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బ్యాక్ సైడ్ గతంలో చిరుతలు సంచరించాయి. ఆ సమయంలో చిరుతలను బంధించిన అటవీ అధికారులు వాటిని బంధించి నల్లమల అడవుల్లో వదిలిపెట్టారు. ఇప్పుడు కొత్తగా మియాపూర్ వంటి జనావాసం ఉన్న ప్రాంతంలో చిరుత కనిపించిందన్న సమాచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వీలైనంత త్వరగా చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.