Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేత
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను వెనక్కి పంపింది నాంపల్లి కోర్టు. పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో తప్పిదాలు ఉన్నాయని కోర్టు తెలపడంతో.. తప్పులు కరెక్ట్ చేసి మళ్లీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 90రోజుల్లో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేకపోయారని.. బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలున్నాయని పోలీసులు వాదించారు. దాంతో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది నాంపల్లి కోర్టు.