చుట్టూ కృష్ణానది నీరు..మధ్యలో ఐలాండ్.. చుట్టూ నీరు ఉండడంతో ఐలాండ్‌పై చిక్కుకున్న కోతి
ఆకలితో అలమటిస్తున్న కోతికి మత్స్యకారుల సాయం.. అరటిపళ్లను అందిస్తూ ఆకలి తీరుస్తున్న స్థానిక మత్స్యకారులు
Nagarkurnool: చుట్టూ కృష్ణా నది నీరు. మధ్యలో పూర్వకాలపునాటి బురుజు. ఐలాండ్ చుట్టూ ఎటుచూసినా కృష్ణా నది నీరే తప్ప దారి లేదు. దీంతో ఓ కోతి ఐలాండ్ మధ్యలో చిక్కుకుపోయింది. చుట్టూ నీరు ఉండడంతో వెళ్లేదారిలేక..బురుజుపైనే ఆకలితో అలమటిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్ల వెల్లి మండలం మంచాలకట్ట గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోతి పరిస్థితిని గమనించిన కొంతమంది మత్స్యకారులు..అరటిపళ్లను అందిస్తూ వానరం ఆకలిని తీరుస్తున్నారు. మరబోటు సాయంతో కోతి ఉంటున్న ప్రాంతానికి వెళ్లి దానికి పళ్లను అందిస్తున్నారు.
కృష్ణా నదిలో నీరు తక్కుకువగా ఉన్నపుడు కోతి అక్కడికి వెళ్లింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు జూరాల నుండి వరద నీరు అధికంగా రావడంతో బురుజు చుట్టూ నీరు చేరుకుంది. దీంతో అ కోతి ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆకలితో అలమటిస్తూ బురుజుపైనే ఇరుక్కుపోయింది. బురుజు దగ్గర ఇరుక్కున్న కోతిని గమనించిన మత్స్యకారులు కోతిని అక్కడినుండి తీసుకురావడానికి ప్రయత్నం చేసినా వీలు కాలేదు. ఈ విషయం కాస్తా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో కోతిని ఎలాగైనా రక్షించాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి