క్రికెట్ ప్రేమికుల కోసం పెళ్లి మండపంలోనే లైవ్ స్క్రీన్ ఏర్పాటు

World Cup 2023: బంధువుల కోసం పెళ్లిలోనే LED వాల్‌లో క్రికెట్ లైవ్ వచ్చేలా ఏర్పాటు చేసిన శివ

Update: 2023-11-19 11:13 GMT

క్రికెట్ ప్రేమికుల కోసం పెళ్లి మండపంలోనే లైవ్ స్క్రీన్ ఏర్పాటు 

World Cup 2023: భారత్- ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడంతో ప్రేక్షకులంతా టీవీలకే అతుక్కుపోయారు. మ్యాచ్‌ను ఉత్కంఠగా వీక్షిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పెళ్లికి వెళ్లాల్సి వస్తే ..? క్రికెట్ మిస్ కావాల్సిందేనా..? అలాంటి వారి కోసమే ప్రత్యేక ఏర్పాటు చేశాడు పెళ్లి కొడుకు. క్రికెట్ ప్రేమికుల కోసం ఏకంగా పెళ్లి మండపంలోనే లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేశాడు. పెళ్లి్కి వచ్చే వారు ఏమాత్రం క్రికెట్‌ను మిస్ కాకుండా.. ఏర్పాటు చేసి ఔరా అనిపించుకున్నాడు. పెళ్లికి వచ్చిన వారు కూడా..ఇటు పెళ్లిని, అటు క్రికెట్ వీక్షిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కత్తి శివ వివాహం మమునూరు HRS గార్డెన్ లో జరిగింది. బంధువులు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను మిస్ కాకుండా పెళ్లిలోనే LED వాల్ లో క్రికెట్ లైవ్ వచ్చేలా ఏర్పాటు చేసి ఖుషి చేశాడు పెళ్లి కొడుకు.

Tags:    

Similar News