Mariyamma Lockup Death: మరియమ్మ లాకప్‌డెత్‌ కేసులో కీలక మలుపు

Mariyamma Lockup Death: * లాకప్ డెత్‌కు కారకులైన పోలీసులపై సీపీ చర్యలు * ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగింపు

Update: 2021-07-21 03:45 GMT

రాచకొండ కమిషనరేట్ (ఫైల్ ఫోటో)

Mariyamma Lockup Death: ఖమ్మం జిల్లాలో దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ వి మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యను సర్వీసు పూర్తిగా తొలగించారు. ఇప్పటి వరకు సస్పెన్షన్‌లో ఉన్న వీరిని పూర్తిస్థాయి విచారణ అనంతరం విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ రాచకొండ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్ డెత్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సిందిగా రాచకొండ కమిషనర్‌ను ఆదేశించింది.

ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన పోలీసు ఉన్నతాధికారులు తప్పు జరిగినట్లుగా తేల్చారు. ఆర్టికల్ 311(2)(b), 25(2) ప్రకారం విధులను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించిన రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ నిందితులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిస్మిసల్ ఆర్డర్స్ ఇవాల్టి నుంచే వర్తిస్తాయని స్పష్టం చేశారు.

Tags:    

Similar News