Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక ట్విస్ట్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌లో అన్ని పిటిషన్లపై సోమవారం విచారణ
Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక ఇంట్రెస్టింగ్ అంశం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తన కస్టడీ ముగిసిందని తెలుపుతూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇక తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయనున్నారు పోలీసులు.
తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విచారణ కోసం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అటు కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌పైనా నాంపల్లి కోర్టు సోమవార విచారణ చేయనుంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని పిటిషన్లను కలిసి సోమవారం విచారించనుంది నాంపల్లి కోర్టు.