బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై కేసు నమోదు

విద్యార్థుల అస్వస్థతకు కారణమైన మెస్‌ కాంట్రాక్టర్లపై చర్యలు

Update: 2022-07-16 05:10 GMT

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై కేసు నమోదు

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన మెస్‌ కాంట్రాక్టర్లు, ఇన్‌ఛార్జీలపై కేసు నమోదు చేశారు. ఫుడ్ పాయిజన్‌ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు.. నిజామాబాద్‌ ప్రభుత్వా్స్పత్రి నుంచి 11 మంది విద్యార్థులు డిశ్చార్జ్ కాగా.. మరో 11 మందికి చికిత్స కొనసాగుతోంది. వారిని కూడా ఇవాళ డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు బాసటగా నిలిచారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు తెలంగాణ జాగృతి తరపున భోజన ఏర్పాట్లు చేశారు. రాత్రి నుంచి విద్యార్థులతోనే జాగృతి కార్యకర్తలు ఉన్నారు. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవితకు విద్యార్థులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.

Tags:    

Similar News