గిన్నీస్ రికార్డ్ సృష్టించిన వజ్రాలు పొదిగిన ఉంగరం

Update: 2020-10-25 13:57 GMT

ఒక్క ఎవరైన ఒక్క డైమండ్ ని పెట్టుకుంటారు. లేదా చిన్న చిన్న డైమండ్స్ అయితే ఒక 100 వరకు పెడతారు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. ఒక్క ఉంగరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7,801 డైమండ్స్ ని పొదిగారు. దీంతో ఆ రింగ్ గిన్నీస్ వాల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది. ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో 'ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం' పేరుతో ఈ ఉంగరాన్ని తయారు చేశారు. ఈ పుష్పాన్ని ఆ వ్యాపారి అరుదుగా దొరికే బ్రహ్మ కమలాన్ని మోడల్ గా తీసుకుని రూపొందించారు. అయితే ఆ రింగ్ ను గత నెలలోనే ఆవిష్కరించారు.

మొదట ఈ ఉంగరాన్ని తయారు చేయాలన్న కాన్సెప్ట్‌ను 2018 సెప్టెంబర్‌లో రూపొందించారు. కేవలం ప్లానింగ్‌కే 45 రోజుల సమయం పట్టింది. అప్పుడు అది కేవలం పెన్సిల్ డ్రాయింగ్ మాత్రమే. ఆ తర్వాత ఉంగరం తయారు చేసే పని మొదలుపెట్టారు. 2019 మార్చి నాటికి రింగ్ బేస్ తయారైంది. ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు 11 నెలల సమయం పట్టగా గతేడాది ఆగస్ట్ నాటికి రింగ్ తయారైంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ పని మొదలైంది. ఈ ఉంగరం ఆరు లేయర్స్‌తో ఉంటుంది. ప్రతీ లేయర్‌లో 8 రేకులు ఉంటాయి. మొత్తం ఉంగరంలో 7801 వజ్రాలున్నాయి. అయితే ఈ ఉంగరం పూర్తిగా తయారైన తరువాత దాన్ని గత ఏడాది గిన్నీస్ వాల్డ్ రికార్డ్ కోసం ఈ ఉంగరాన్ని సబ్మిట్ చేశారు. కాగా ఆ ఉంగరాన్ని అనేక రౌండ్లు వెరిఫికేషన్ చేసి డైమండ్స్ పొదిగిన ఉంగరాన్ని గిన్నీస్ రికార్డ్ లో చేర్చారు.

Tags:    

Similar News