నూతన జోనల్ విధానం ద్వారానే ఉద్యోగాల భర్తీ- కేసీఆర్
New Zonal System: ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
New Zonal System: ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా శాఖల్లో ఖాళీలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఆదేశించారు. అలాగే, ప్రమోషన్ల తర్వాత ఖాళీ అయ్యే ఉద్యోగాలను రెండో దశలో భర్తీ చేసేందుకు నివేదిక సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే, నూతన జోనల్ విధానం ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
నూతన జోనల్ విధానానికి అడ్డంకులు తొలగిపోవడంతో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. స్థానికులకు న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు తెలిపారు.
పలు శాఖల్లో దాదాపు లక్షా92 వేల ఖాళీలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా విద్యా శాఖలో 28వేల 7వందల 18ఖాళీలు, హోం శాఖలో 17వేల 182, వైద్య శాఖలో 30వేల 5వందల71. రెవెన్యూశాఖలో 7వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి పూర్తి స్థాయి కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఏశాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ? నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారనే దానిపై ఈ నెల 13న జరిగే క్యాబినెట్ భేటీలో క్లారిటీ రానుంది.