తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?

TS News: సీఎం కేసీఆర్‌ పీపుల్స్ ఫ్రంట్‌కు చెక్ పెట్టాలని చూస్తోన్న బీజేపీ...

Update: 2022-03-11 02:42 GMT

తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?

TS News: ఐదు రాష్ట్రల ఎన్నికల ఫలితాలలో కమలం పార్టీ నాలుగు రాష్ట్రాల్లో వికసించింది. బీజేపీ అధికార పగ్గాలు ఆ రాష్ట్రలలో చేపట్టనుంది. దీంతో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమంటున్న కమళం పార్టీ నేతలు మరింత జోష్ పెంచారు. ఇక సీఎం కేసీఆర్ ప్రకటించిన పీపుల్స్ ఫ్రంట్‌కు తమ దూకుడుతో చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడింది. పంజాబ్‌లో అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్ దారుణ ఓటమిని చవిచూసింది.

కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను, LIC, BSNL లను ప్రైవేటీకరణ చేస్తుందని ప్రచారం చేసినా.. ప్రజల్లో మాత్రం బీజేపీపై వ్యతిరేకత కనబడలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రులు గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని వనరులు ఉన్న వాడుకోవడం రావడం లేదని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రాల హక్కులను హారిస్తోందని బీజేపీపై విమర్శలు చేశారు.

ఇక బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసుకుని వెళ్లాలని కేసీఆర్ భావించారు. కొన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ సమయంలో ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయడంతో పాటు దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి రావాలన్న దానిపై ఆలోచనలు చేశారు. ఇక తెలంగాణలోనూ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరా పోరు సాగుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణపై పడతాయని కాషాయ నేతలు భావిస్తున్నారు. ఎలాగైన తెలంగాణలో బలపడి పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. ఇక నాలుగు రాష్ట్రాలలో బీజేపీ అధికార పగ్గాలు చేపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో కొంతమంది ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ మీద ప్రభావం పడే అవకాశం ఉందా..? ఎలాంటి కార్యాచరణ రూపొందించాలన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News