Hyderabad: 24 గంటల్లో 4చోట్ల డ్రగ్స్ ముఠాల అరెస్ట్
Hyderabad: ఎస్సార్‌నగర్, ఫిలింనగర్, చైతన్యపురిలో డ్రగ్స్ ముఠాల అరెస్ట్
Hyderabad: డ్రగ్ పెడ్లర్ల పని పడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. గడిచిన 24 గంటల్లో 4చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశారు. ఎస్సార్‌నగర్, ఫిలింనగర్, చైతన్యపురిలో డ్రగ్స్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. న్యూఇయర్ టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతుండగా.. డ్రగ్ పెడ్లర్లే లక్ష్యంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతో డ్రగ్స్ సరఫరాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు.. ట్రైకమిషనరేట్ పరిధిలో అలర్టయ్యారు. పబ్బులు, సినిమా ఇండస్ట్రీపై నిఘా పెట్టారు.
ఇప్పటికే స్నిప్పర్ డాగ్‌లతో పబ్బుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే.. పాత నేరస్తులపైనా ఫోకస్ పెంచింది టీనాబ్. మరో 11 రోజుల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఉండగా.. పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో.. డ్రగ్ డ్రాపర్ టెస్టులకు టీనాబ్ సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో డ్రగ్ డ్రాపర్ మెషీన్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. న్యూఇయర్ లోపు తెచ్చి అంతటా పరీక్షలు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ డ్రగ్ డ్రాపర్ మెషీన్ ద్వారా లాలాజలం శాంపిల్‌తో క్షణాల్లో డ్రగ్ టెస్ట్ ఫలితాలు వెలువడనున్నాయి.