భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Update: 2020-09-24 05:16 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వరుస ఎన్ కౌంటర్లు వణికిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన మావోలను నియంత్రించాలని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నపురంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతి చెందిన మావోయిస్టులు చర్ల, శబరి ఏరియా కమిటీ సభ్యులుగా పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహాల వద్ద ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుడుకు ఉపయోగించే సామగ్రి, ఒక కిట్‌ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా వారి కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. జిల్లాలో ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 8కి చేరింది.




Tags:    

Similar News