Hyderabad: ఇంటి ఓనర్స్‌కు నయా రూల్స్‌.. టూ లెట్‌ బోర్డును..

Hyderabad: మీకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉందా..? దాన్ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నారా..?

Update: 2021-08-21 01:56 GMT

Hyderabad: ఇంటి ఓనర్స్‌కు నయా రూల్స్‌.. అద్దెదారులకు తెలియాలని..

Hyderabad: మీకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉందా..? దాన్ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నారా..? అద్దెదారులకు తెలియాలని టూ లెట్‌ బోర్డును మీ ఇంటికి కాకుండా మరెక్కడైనా తగిలిస్తున్నారా..? అయితే మీ జేబు గుల్ల కావడం ఖాయం. అవును మీరు ప్రకటన అంటించిన నిమిషాల్లో వేల రూపాయల జరిమానా పడుతుంది. అసలు ఏంటి ఈ కొత్త లొల్లి అనుకుంటున్నారా..?

హైదరాబాద్‌లో సాధారణంగా ప్రకటనలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను అతికిస్తూ ఉంటారు. కామన్‌గా మనం అదిచూస్తూ ఉంటాం. చదువుతూ ఉంటాం. కానీ ఇప్పుడు రూల్‌ మారింది. ఎక్కడ పడితే అక్కడ ప్రకటన బోర్డు బెడితే అధికారులు చూస్తూ ఊరుకోరు. అవును ఖైరతాబాద్‌ సర్కిల్‌లోని ఆనంద్‌ నగర్‌లో ఓ ఇంటి యజమాని తన ఇంటి పక్కకు టూ లెట్‌ బోర్డు పెడితే 2వేల రూపాయల జరిమానా విధించారు అధికారులు. ఇప్పుడు దీనికి సంబంధించిన చలానా కాపీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విధంగా చాలాకాలంగా నగరవాసులకు ఈవీడీఎం అధికారులు జరిమానాలు విధిస్తున్నారు.

అసలే కరోనాతో కిరాయి దారులు ఇళ్లు ఖాళీ చేయడంతో అద్దెలు రాక ఇబ్బందులు పడుతుంటే, ఈవీడీఎం అధికారులు జరిమానా విధించడం సరికాదని పలువురు వాపోతున్నారు. తమ లాంటి చిరు వ్యాపారులు, ఇంటి అద్దెతో బ్రతికేవారిపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలంటున్నారు.

మొత్తానికి నగరంలో ప్రకటనల బోర్డులు, వాటిపై విధించిన చలాన్లపై ఈవీడీఎం అధికారులు వివరణ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా ఇంటి ముందు టూ లెట్‌ బోర్డు పెడితే కాదు, పబ్లిక్‌ ప్రదేశాల్లో టూ లెట్‌ బోర్డులు పెడితే చలాన్లు విధిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఇకపై కూడా నగరంలోని పబ్లిక్‌ ప్రదేశాల్లో ఎక్కడైనా ఏ చిన్న ప్రకటనైనా ఏర్పాటు చేస్తే బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఈవీడీఎం టీమ్‌ జరిమానాలు విధిస్తాయి.



 


Tags:    

Similar News