TSPSC Paper Leak: కేసులో కీలక పరిణామం.. పేపర్‌ లీక్‌లో రూ.1.63 కోట్లు లావాదేవీలు..!

TSPSC: పేపర్‌ లీక్‌ కేసులో మొత్తం 16 మంది మధ్యవర్తులు. న్యూజిలాండ్‌లో ఉన్న మరో నిందితుడు ప్రశాంత్‌రెడ్డి

Update: 2023-06-09 11:45 GMT

TSPSC: కేసులో కీలక పరిణామం..పేపర్‌ లీక్‌లో రూ.1.63 కోట్లు లావాదేవీలు..!

TSPSC: TSPSC కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్‌ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. పేపర్‌ లీక్‌లో కోటి 63 లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయని సిట్‌ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో 49 మంది అరెస్ట్‌ అయ్యారు. పేపర్‌ లీక్‌ కేసులో మొత్తం 16 మంది మధ్యవర్తులు ఉన్నట్టు సిట్‌ తెలిపింది. 37 మందిపై అభియోగాలు నమోదు చేసింది సిట్. అలాగే.. మరో నిందితుడు ప్రశాంత్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నట్టు గుర్తించింది. 8 మందికి డీఏఓ ప్రశ్నాపత్రం లీకైనట్టు పేర్కొంది. ఏఈ ప్రశ్నాపత్రం 13 మందికి చేరినట్టు గుర్తించింది. నలుగురికి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నాపత్రం, ఏడుగురికి ఏఈఈ ప్రశ్నాపత్రం లీకైనట్టు చార్జ్‌షీట్‌లో సిట్‌ పేర్కొంది. ఏఈఈ పరీక్షలో మరో ముగ్గురు చూచిరాతకు పాల్పడినట్టు గుర్తించింది. ఇక.. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను రామంతాపూర్‌ సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఉంచినట్టు సిట్‌ తెలిపింది.

Tags:    

Similar News