గ్రేటర్ ఎన్నికల్లో 16 మంది స్టూడెంట్లు పోటీ

Update: 2020-11-26 06:05 GMT

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరు మీద సాగుతోంది. సాధారణంగా ఎన్నికల క్యాంపెయిన్‌లో యువత ముందు వరుసలో ఉంటారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారంతో పాటు పోటీలో కూడా యువత, విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బల్దియా ఎన్నికల్లో యువత, విద్యార్థులు పోటీ చేస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో సుమారు 16 మంది స్టూడెంట్లు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి కొందరు, ఇండిపెండెంట్లుగా మరికొందరు బరిలో నిలిచారు. గతంలో ఇంత మంది స్టూడెంట్స్​ఎప్పుడు కూడా ఎన్నికల్లో కంటెస్ట్ చేయలేదు. ఈ ఏడాది కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఎన్నో నేర్చుకున్నామని, తాము కూడా ప్రజలకు మేలు చేసేందుకు పాలిటిక్స్​లోకి వచ్చినట్లు యంగ్ క్యాండిడేట్స్​చెబుతున్నారు. 21, 22 ఏళ్ల వారు సైతం నామినేషన్​ దాఖలు చేశారు. స్టూడెంట్లు మాత్రమే కాకుండా సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్, ప్రైవేట్‌ టీచర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, నిరుద్యోగులు పలుచోట్ల ఎన్నికల బరిలో దిగారు.

GHMC ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 1,122 మంది క్యాండెట్లలో డిగ్రీ, పీజీ చదివిన వారి సంఖ్య 40 శాతం వరకు ఉంది. మిగతా వారంతా ఇంటర్, టెన్త్, అంతకంటే తక్కువ చదివిన వారు ఉన్నారు. ఈసారి నలుగురు డాక్టర్లు, పది మంది అడ్వకేట్లు, నలుగురు ప్రైవేట్ టీచర్లతో పాటు జర్నలిస్టులు పోటీలో ఉన్నారు. మామూలుగా అయితే 25 ఏళ్లు దాటేంత వరకు రాజకీయాల గురించి పట్టించుకునే యూత్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం 21ఏళ్ల లోపు వాళ్లు కూడా నామినేషన్ వేశారు. అన్ని పార్టీల క్యాండిడేట్లలో చిన్న వయసులోనే పోటీ చేస్తున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు. ప్రధాన పార్టీలలో పోటీ చేసేవారితో పాటు, అక్కడ టికెట్ లు రాకపోవడంతో ఇండిపెండెంట్ గా ఎంతో మంది యువత జీహెచ్ఎంసీ పోటీలో ఉన్నారు.

Tags:    

Similar News