Huzurabad By-Election: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో 30 మంది

*ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు *ఈటల జమున సహా 12 మంది ఉపసంహరణ *పోటీలో నిలిచిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు

Update: 2021-10-14 02:33 GMT

హుజురాబాద్ ఉప ఎన్నికలు (ఫోటో- ది హన్స్ ఇండియా)

Huzurabad By-Election: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారనేది తేలిపోయింది. మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. హుజూరాబాద్ బైపోల్ కోసం మొత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్రులు, చిన్న పార్టీల నుంచి కొందరు నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ల స్క్రూటినీ అనంతరం 43 మంది నామినేషన్లను మాత్రమే అధికారులు అంగీకరించారు. అయితే చివరి రోజైన బుధవారం సాయంత్రం వరకు 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఇక ఈటల జమునతో సహా మొత్తం 12 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడం ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని భావించిన జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు చివరికి ఇద్దరే పోటీలో నిలిచారు. ఇక ఈనెల 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాల వెల్లడిస్తారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఇక ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు. దసరా తర్వాత పోరు మరింత ఉధృతం చేయనున్నాయి. బై పోల్‌లో 30 మంది బరిలో నిలవగా అందులో ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇక టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

ఇదిలా ఉంటే హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కో ఓటుకు 30 వేల నుంచి 50 వేలు చెల్లిస్తోందంటూ ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌ సోమ. ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌పై ఈటల తప్పుడు ఆరోపణల్ని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

Tags:    

Similar News