10th Class Exams: నేటి నుంచి ఏపీ, తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్
10th Class Exams: ఉదయం 9.30 నుంచి మ.12.30 వరకు పరీక్షలు
10th Class Exams: తెలుగు రాష్ట్రాల్లో కాసేపట్లో టెన్త్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండుర గంటల వరకు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు 5 లక్షల 9 వేల మంది విద్యార్థులు హాజరుకానుండగా.. ఏపీలో 7 లక్షల 25 వేల మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్నారు. తెలంగాణలో ఎగ్జామ్స్ ఏప్రిల్ 2తో ముగియనుండగా.. ఏపీలో ఈ నెల 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
ఇక తెలంగాణలో జరగనున్న టెన్త్ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల్లో క్వశ్చన్ పేపర్లు తారుమారు, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రం విద్యార్థులు అందుకోగానే ప్రతిపేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లు రాయాలని సూచించింది. కాపీయింగ్‌కు పాల్పడితే డిబార్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇప్పటి వరకు అమలులో ఉన్న ఐదు నిమిషాల నిబంధనను ఎత్తివేసింది. ఎగ్జామ్ సెంటర్‌కు ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది.