100 Beds for Siddipet Covid19 Hospitals: సిద్ధిపేటలో 100 పడకల కరోనా హాస్పిటల్..!
100 Beds for Siddipet Covid19 Hospitals: తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలో వంద పడకల కోవిడ్ వార్డును బుధవారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి
100 Beds for Siddipet Covid19 Hospitals: తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలో వంద పడకల కోవిడ్ వార్డును బుధవారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.. ఆదివారం సాయంత్రం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ను సందర్శించిన ఆయన.. రోగులకు అందుతున్న చికిత్స, సౌకర్యాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా టెస్టులకి సంబంధించిన పరికరాలు అన్ని వచ్చాయా ?వెంటిలేటర్లను బిగించారా? మొదలగు అంశాలపైన అధికారులతో చర్చించారు. అంతేకాకుండా కరోనా బాధితులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు..
ప్రస్తుతం కరోనా ఎలా ఉందని, వైద్య సిబ్బంది ఎలా చూసుకుంటున్నారు. వేడి వేడి ఆహారం అందిస్తున్నారా... వేడి నీళ్లు ఇస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. అయితే దీనిపైన పేషెంట్లు స్పందిస్తూ.. సిబ్బంది బాగా చూసుకుంటున్నారని, ఓ పూట చికెన్ తో భోజనం పెడుతున్నారని బాధితులు వెల్లడించారు. ఇక బాధితులకు ఏం కాదని మంత్రి భరోసా ఇచ్చారు. అయితే వైద్యులు సూచించిన విధంగా చికిత్సను పొందాలని మంత్రి వారికి వెల్లడించారు. ఇక జిల్లా వ్యాప్తంగా కరోనా పరిస్థితుల పై మంత్రి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
ఇక తెలంగాణలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి ఆదివారం నాటికి ఉన్న సమాచారం మేరకు కొత్తగా రాష్ట్రంలో 1,269 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,671 కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 8 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 356 కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 800 కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 11,833 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది
అటు కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.