Vivo V50e: వావ్.. ఫీచర్లు పిచ్చెక్కించేశాయ్.. వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర మీ బడ్జెట్‌‌లోనే..!

Vivo V50e: వివో V50e స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందు కొత్త సమాచారం వెల్లడైంది.

Update: 2025-04-02 06:08 GMT
Vivo V50e Specifications Confirmed Expected Price and Launch Date

Vivo V50e: వావ్.. ఫీచర్లు పిచ్చెక్కించేశాయ్.. వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర మీ బడ్జెట్‌‌లోనే..!

  • whatsapp icon

Vivo V50e: వివో V50e స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందు కొత్త సమాచారం వెల్లడైంది. వివో కంపెనీ ఈసారి డిఫరెంట్ లెవల్ మోడల్ ఐడియాతో ముందుకొచ్చింది. మార్కెట్లోకి రాకముందే 'Vivo V50e' స్మార్ట్‌ఫోన్ దాదాపు అన్ని అధికారిక ఫీచర్లు,స్పెసిఫికేషన్‌లను పోస్ట్ చేసి వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. స్మార్ట్‌ఫోన్ పోస్ట్ సోనీ సెన్సార్‌తో 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని ధృవీకరించింది.

Vivo V50e Features And Specifications

Vivo V50e స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల FHD+ క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌‌కి సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 4,500 నిట్స్ బ్రైట్నెస్‌ను అందించే అవకాశం ఉంది. కెమెరాల పరంగా స్మార్ట్‌ఫోన్‌లో 50MP IMX882 సెన్సార్‌, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో సహా డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉండనుంది. అలానే స్మార్ట్‌ఫోన్‌లో 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

Vivo V50e స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో రానుంది. LPDDR4X, UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా FunTouch OS 15లో రన్ అవుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5600mAh బ్యాటరీ ఉంటుంది. మొబైల్ IP68+IP69 సర్టిఫికేషన్‌ను కూడా దక్కించుకుంది.

Vivo V50e Price

లీక్స్ ప్రకారం.. ఈ రాబోయే Vivo V50e స్మార్ట్‌ఫోన్ బేస్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 30,000 కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే బ్రాండ్ ఇంకా అధికారిక ధరను ప్రకటించలేదు. స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తోమరొక మోడల్ ధర రూ.32,999. చివరగా, దీని 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ ధర రూ. 34,999గా ఉంటుందని సమాచారం.

Tags:    

Similar News