Samsung Galaxy S24 Plus Price Cut: అమెజాన్ అద్భుతమైన ఆఫర్.. సగం కన్నా తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్.. కానీ ఇది గమనించండి..!
Samsung Galaxy S24 Plus Price Cut: ఈ కామర్స్ సైట్ అమెజాన్ Samsung Galaxy S24+ పై భారీ ఆఫర్ ప్రకటించింది.

Samsung Galaxy S24 Plus Price Cut: అమెజాన్ అద్భుతమైన ఆఫర్.. సగం కన్నా తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్.. కానీ ఇది గమనించండి..!
Samsung Galaxy S24 Plus Price Cut: ఈ కామర్స్ సైట్ అమెజాన్ Samsung Galaxy S24+ పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ మొబైల్ జనవరి 2024లో లాంచ్ అయింది. ఆ సమయంలో, దాని ధర 12GB+256GB వేరియంట్‌కు రూ. 99,999, 12GB+512GB వేరియంట్‌కు రూ. 1,09,999. కానీ ఇప్పుడు ఈ ఫోన్ చాలా చౌకగా లభిస్తుంది. 12GB+256GB వేరియంట్ కేవలం రూ. 56,746కి అందుబాటులో ఉంది. అలానే ఎటువంటి ఆఫర్ లేకపోయినా రూ. 53,999కి కొనుగోలు చేయచ్చు. 12GB+512GB వేరియంట్ ధర ఇప్పుడు రూ.66,999గా ఉంది. ఇది కాకుండా, మీకు అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
Samsung Galaxy S24+ Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ S24+ లో కంపెనీ దాని సొంత ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌ను అందించింది. ఈ ఫోన్ సామ్‌సంగ్ One UI సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది, ఇది ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా, సులభంగా మారింది. ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే, సామ్‌సంగ్ 7 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్లు అందిస్తామని హామీ ఇస్తోంది. అంటే మీ ఫోన్ చాలా కాలం పాటు కొత్తగా, సురక్షితంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో అనేక AI ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇవి ఫోటోలను ఎడిటింగ్ చేయడం, అనువదించడం లేదా కాల్‌లను అర్థం చేసుకోవడం వంటి మీ రోజువారీ పనులను సులభతరం చేస్తాయి. అయితే, ఇప్పుడు కొన్ని కొత్త ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చాయి, ఇవి క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 లేదా 8 జెన్ 3 ఎలైట్ చిప్‌సెట్‌తో ఉన్నాయి. ఈ చిప్‌సెట్‌లు వేగం, గేమింగ్‌లో కొంచెం మెరుగ్గా పనిచేస్తాయి.
ఈ మొబైల్ లోపాల గురించి మాట్లాడుకుంటే, సామ్‌సంగ్ గెలాక్సీ S24 + కెమెరా ఈ ధర పరిధిలోని ఇతర ఫోన్‌ల మాదిరిగా లేదు. అంటే ఫోటోలు, వీడియోల నాణ్యత పర్వాలేదు, కానీ ఉత్తమమైనది కాదు. ఇది కాకుండా, దాని ఛార్జింగ్ వేగం కూడా కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఈ రోజుల్లో, చాలా ఫోన్లు 100W లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తున్నాయి, దీని కారణంగా ఫోన్ కొన్ని నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. కానీ S24+ లో అలా కాదు.