Airtel: ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్ రూ. 2249కే ఏడాది మొత్తం రీఛార్జ్ చేసుకునే అవసరం లేదు..!
Airtel Cheapest Plan: ఎయిర్‌టెల్ రెండో అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజ కంపెనీ జియో తర్వాత ఎక్కువ మంది యూజర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం 38 కోట్ల యూజర్లతో ఎయిర్‌టెల్ తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది.

Airtel: ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్ రూ. 2249కే ఏడాది మొత్తం రీఛార్జ్ చేసుకునే అవసరం లేదు..!
Airtel Cheapest Plan: ఎయిర్‌టెల్ చీపెస్ట్ ప్లాన్స్ కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో టెలికాం ధరలు పెరిగిన తర్వాత ఎక్కువ శాతం మంది ఎయిర్‌టెల్ యూజర్లు ఇతర టెలికాం కంపెనీలకు మారారు. ఈ నేపథ్యంలో మళ్లీ వారిని ఆకర్షించే విధంగా ఈ కంపెనీ కొత్త ప్లాన్లు అందుబాటులోకి తీసుకువస్తుంది. అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి.
ఇప్పటికే ఎయిర్‌టెల్ వివిధ కేటగిరీల కస్టమర్‌లకు వాళ్లకు తగిన విధంగా రీఛార్జి ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. బడ్జెట్‌లోనే ఇవి ఉంటున్నాయి. ఫీచర్ ఫోన్ ఉపయోగించే వారికి కేవలం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది మాత్రమే కాదు ఏడాది మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండే చీపెస్ట్ ప్లానె కూడా ఇది. ఇందులో ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు.
ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ రూ.2249 ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఏడాది మొత్తం ఫ్రీ కాలింగ్ అందిస్తుంది. అంటే 365 రోజులు వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో మీరు రెండు ఎస్‌టీడీ, లోకల్ కాల్స్ ఉచితంగా పొందుతారు. ఇది కాకుండా 3600 ఎస్ఎంఎస్లు ఉచితం.
ఇక ఈ ప్లాన్ లో ఎయిర్‌టెల్ 30 జీబీ డేటా అందిస్తుంది. ఏడాది మొత్తం ఇది వర్తిస్తుంది. డేటా తక్కువగా ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఎక్కువగా డేటా ఉపయోగిస్తే యాడ్ ఆన్ ప్లాన్స్ యాడ్ చేసుకోవచ్చు. డేటా ఎక్కువగా ఉపయోగించలేని వారికి ఇది ఏడాదంతా వర్తిస్తుంది. ఎందుకంటే ట్రయ్ ఆదేశాల మేరకు డేటా ఉపయోగించలేని కస్టమర్ల కోసం కొన్ని ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే రూ.1849 ప్లాన్ కూడా తీసుకువచ్చింది. ఇది కూడా ఏడాది మొత్తం వర్తిస్తుంది.