Motorola Edge 60 Stylish: అసలు ఊహించలేరు.. మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫస్ట్ సేల్.. ఆఫర్లు అరాచకం..!
Motorola Edge 60 Stylus: మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. ఇప్పుడు మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. దీని మొదటి సేల్ ఈరోజు అంటే 23 ఏప్రిల్ 2025న మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది.

Motorola Edge 60 Stylish: అసలు ఊహించలేరు.. మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫస్ట్ సేల్.. ఆఫర్లు అరాచకం..!
Motorola Edge 60 Stylus: మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. ఇప్పుడు మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. దీని మొదటి సేల్ ఈరోజు అంటే 23 ఏప్రిల్ 2025న మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ కొనుగోలుపై కంపెనీ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
ఈ ఫోన్ ధర 8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.22,999. కానీ సేల్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌లు దీన్ని మరింత సరసమైనవిగా చేస్తాయి. మీరు మొత్తం రూ. 6,000 వరకు తగ్గింపు పొందచ్చు, దీని వలన ఫోన్ ధర రూ. 16,999 కి తగ్గుతుంది. ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Motorola Edge 60 Stylus Offers
ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడంపై, యాక్సిస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ. 1,000 తక్షణ తగ్గింపు ఇస్తుంది. దీనితో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 1000 అదనపు తగ్గింపు కూడా పొందొచ్చు. ఇది కాకుండా, రిలయన్స్ జియో వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కూడా ఇస్తున్నారు.
రిలయన్స్ జియో వినియోగదారులకు రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్, షాపింగ్, విమాన, హోటల్ బుకింగ్ డీల్స్ వంటి రూ.8,000 అదనపు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇది కాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం తక్షణ తగ్గింపు కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్లతో, మీరు ఈ మిడ్-రేంజ్ ఫోన్‌ను రూ.20,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Motorola Edge 60 Stylush Specifications
మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ మిడ్ రేంజ్ విభాగంలో దాని ప్రత్యేక స్థానానికి సంపాదించుకుంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ఉంది. 8జిబి ర్యామ్ , 256 జిబి ఇంటర్నల్
స్టోరేజ్‌తో వస్తుంది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. అడ్రినో 710 GPU గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో UI పై నడుస్తుంది. ఇది ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది. మోటరోలా 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లను హామీ ఇస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ కలిగి ఉంది, అంటే నీరు, ధూళి నుండి రక్షిస్తుంది. ఇందులో MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా అందిస్తుంది. ఇది రెండు పాంటోన్-క్యూరేటెడ్ కలర్స్ లో లభిస్తుంది—సర్ఫ్ ది వెబ్ (మాట్టే ఫినిష్), జిబ్రాల్టర్ సీ (వేగన్ స్వెడ్ టెక్స్చర్).
ఈ విభాగంలో మొట్టమొదటి స్కెచింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఫీచర్లను అందిస్తుంది. స్కెచ్-టు-ఇమేజ్, AI స్టైలింగ్, AI మ్యాజిక్ ఎరేజర్ వంటి మోటో AI ఫీచర్లు ఉన్నాయి.
దీనికి 50MP సోనీ లైటియా 700C ప్రైమరీ సెన్సార్ ఉంది. ఇది 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3-ఇన్-1 లైట్ సెన్సార్ ఉంది. ఇది లైటింగ్ పరిస్థితులను ఆప్టిమైజ్ చేస్తుంది. సెల్ఫీ , వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఇందులో 6.7-అంగుళాల 1.5K pOLED పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది 10-బిట్ కలర్ డెప్త్, 100 శాతం DCI-P3 కలర్ స్పేస్,s HDR10+ లకు సపోర్ట్ ఇస్తుంది. డిస్ప్లేలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, వాటర్ టచ్ 3.0 టెక్నాలజీ అందించారు. 68W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ అందించారు.