Redmi Turbo 4 Pro: రెడ్‌మి క్రేజే వేరు.. కొత్త రెడ్‌మి టర్బో 4 ప్రో ఫోన్ చూస్తే మీరు ఇదే అంటారు.. ఫీచర్లు మాత్రం హైరేంజ్ అంతే.. ధర ఎంతో తెలుసా?
Redmi Turbo 4 Pro: రెడ్‌మి టర్బో 4 ప్రో ఏప్రిల్ 24న చైనాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనా సమయం సాయంత్రం 7 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు లాంచ్ అవుతుంది.

Redmi Turbo 4 Pro: రెడ్‌మి క్రేజే వేరు.. కొత్త రెడ్‌మి టర్బో 4 ప్రో ఫోన్ చూస్తే మీరు ఇదే అంటారు.. ఫీచర్లు మాత్రం హైరేంజ్ అంతే.. ధర ఎంతో తెలుసా?
Redmi Turbo 4 Pro: రెడ్‌మి టర్బో 4 ప్రో ఏప్రిల్ 24న చైనాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనా సమయం సాయంత్రం 7 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించి కంపెనీ అనేక టీజర్‌లను విడుదల చేసింది. ఈ టీజర్లు దాని డిజైన్, కలర్ ఆప్షన్లను వెల్లడిస్తుంది. రెడ్‌మి టర్బో 4 ప్రో 2.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరిలో చైనాలో విడుదల చేసిన రెడ్‌మి టర్బో 4 వేరియంట్‌కు సమానమైన డిజైన్‌తో వస్తుంది. దీని బేస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 840- అల్ట్రా ప్రాసెసర్, 1.5K రిజల్యూషన్ OLED డిస్‌ప్లే ఉన్నాయి.
Redmi Turbo 4 Pro Design And Camera
రెడ్‌మి టర్బో 4 ప్రో సన్నని అంచులతో ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో మెటల్ మిడిల్ ఫ్రేమ్, డిస్‌ప్లే పైన మధ్యలో హోల్-పంచ్ కెమెరా స్లాట్ అందిచారు. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు కెమెరా సెన్సార్‌లు ఐఫోన్ 16 సిరీస్ మాదిరిగా ఉంటాయి. దీనికి LED ఫ్లాష్ యూనిట్ కూడా ఉంటుంది. వాల్యూమ్,పవర్ బటన్లు ఫోన్ కుడి వైపున చూడచ్చు. దీని వెనుక కవర్‌ను “సాఫ్ట్ మిస్ట్ గ్లాస్” అని పిలుస్తారు, ఇది ఫోన్‌కు చక్కని రూపాన్ని ఇస్తుంది.
Redmi Turbo 4 Pro Color Options And Processor
రెడ్‌మి జనరల్ మేనేజర్ థామస్ వాంగ్ తన వీబో పోస్ట్‌లో రెడ్‌మి టర్బో 4 ప్రో మూడు కలర్స్‌లో లభిస్తుందని ధృవీకరించారు -బ్లాక్, గ్రీన్, వైట్. ఈ ఫోన్ 2.5K డిస్‌ప్లే, 4ఎన్ఎమ్ ఆక్టాకోర్ చిప్‌సెట్ అయిన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ 24జీబీ వరకు ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది, ఇది ఫోన్ వేగం మరియు పనితీరును మెరుగుపరుస్తుంది.
Redmi Turbo 4 Pro Battery And Launch Date
అనేక లీకైన నివేదికల ప్రకారం.. రెడ్‌మి టర్బో 4 ప్రోలో 7,000mAh కంటే పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది కాకుండా, ఈ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్లలో పోకో ఎఫ్ 7 పేరుతో కూడా లాంచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ దాని శక్తివంతమైన ప్రాసెసర్, బ్యాటరీ, గొప్ప డిజైన్‌తో మార్కెట్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి సమాచారం ఏప్రిల్ 24న లాంచ్ అయిన తర్వాత అందుబాటులో ఉంటుంది.