iQOO: ఐకూ నుంచి అదిరిపోయే ఫోన్లు.. ఫీచర్లు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
iQOO: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది.

iQOO: ఐకూ నుంచి అదిరిపోయే ఫోన్లు.. ఫీచర్లు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
iQOO: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఏప్రిల్ 28వ తేదీన రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. లాంచింగ్‌కు ముందే కంపెనీ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోన్‌లకు సంబంధించిన ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా కంపెనీ iQOO Z10 Turbo, Z10 Turbo Pro పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి.
iQOO Z10 Turbo Pro ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే:
ఇందులో Snapdragon 8s Gen 4 చిప్ ప్రాసెసర్‌ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక LPDDR5X Ultra RAMతో ఈ ఫోన్ రానుంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా Q1 చిప్‌ను అందించనున్నారు. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 144Hz రిఫ్రెష్ రేటింగ్‌తో కూడాన OLED స్క్రీన్ ఇవ్వనున్నారు. 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ ఫోన్ సొంతం. అలాగే ఇందులో 120W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారు. 100W PD/PPS స్టాండర్డ్స్ సపోర్ట్ చేస్తుంది.
ఇక ఇందులో ప్రత్యేకంగా కూలింగ్ సిస్టమ్ కోసం 7K ఐస్-సెన్స్ VC లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్ బరువు 206 గ్రాములు కాగా, వెడల్పు 75.88 మిల్లీమీటర్లుగా ఉండనుంది.
iQOO Z10 Turbo ఫీచర్లు:
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2,000 నిట్స్ బ్రైట్నెస్‌తో కూడిన 144Hz OLED స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. కూలింగ్ కోసం 7K ఐస్-సెన్స్ VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఇవ్వనున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు (1611B యూనిట్స్) ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ MediaTek Dimensity 8400 చిప్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ధరలకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పూర్తి ఫీచర్లు ధరకు సంబంధించిన వివరాలు తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.