iQOO Z10 Turbo Series: అదిరిపోయే ఫీచర్లు.. ఐకూ నుంచి సరికొత్త ఫోన్లు.. అల్లాడిస్తున్న లీక్స్..!
iQOO Z10 Turbo Series: iQOO Z10 Turbo, Z10 Turbo Pro ఏప్రిల్ 28న చైనాలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్‌ల ప్రారంభానికి ముందు, కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అనేక కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.

iQOO Z10 Turbo Series: అదిరిపోయే ఫీచర్లు.. ఐకూ నుంచి సరికొత్త ఫోన్లు.. అల్లాడిస్తున్న లీక్స్..!
iQOO Z10 Turbo Series: iQOO Z10 Turbo, Z10 Turbo Pro ఏప్రిల్ 28న చైనాలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్‌ల ప్రారంభానికి ముందు, కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అనేక కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఐకూ Z10 టర్బో ప్రోలో LPDDR5X అల్ట్రా ర్యామ్, Q1 గేమింగ్ చిప్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. రెండు ఫోన్‌లు 144Hz రిఫ్రెష్ రేట్‌తో OLED స్క్రీన్‌లతో వస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఐకూ Z10 టర్బో ప్రో, Z10 టర్బో స్పెసిఫికేషన్లు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో ఒక పోస్ట్‌లో రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల టీజర్‌ను iQOO షేర్ చేసింది. కంపెనీ ప్రకారం, iQOO Z10 టర్బో ప్రోలో LPDDR5X అల్ట్రా RAM, స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇది గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ అప్లికేషన్లు, గేమ్‌లను నిర్వహించే Q1 చిప్. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 100W PD/PPS ఛార్జింగ్ ప్రమాణాలకు అనుకూలంగా ఉంటుంది.
కంపెనీ ప్రకారం.. ఐకూ Z10 టర్బో ప్రోలో 7K ఐస్-సెన్స్ VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, OLED స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉంది. 75.88మిమీ వెడల్పు, 206 గ్రాముల బరువు ఉంటుందని iQOO తెలిపింది.
అదే సమయంలో, iQOO Z10 టర్బోలో అనేక స్పెసిఫికేషన్లు ప్రో వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. ఇది 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 144Hz OLED స్క్రీన్, హీట్ డిస్సిపేషన్ కోసం 7K ఐస్-సెన్స్ VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 1611B యూనిట్లతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, గేమింగ్ కోసం ప్రొప్రైటరీ Q1 చిప్‌ను అందించారు. రెండు మోడళ్ల మధ్య ప్రాథమిక వ్యత్యాసం చిప్‌సెట్. ఐకూ Z10 టర్బోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్ ఉంటుంది. ఇది డైమెన్సిటీ 7300 కంటే 41 శాతం మెరుగైన CPU పనితీరును అందిస్తుంది. 40 శాతం తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఫోన్ మందం 75.88మిమీ, బరువు 212 గ్రాములు. iQOO Z10 టర్బో 7,620mAh సెమీ-సాలిడ్ స్టేట్ 'థర్డ్ జనరేషన్ సిలికాన్' బ్యాటరీతో పనిచేస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.