AC: ఏసీ 18 డిగ్రీల వద్ద నడిపితే ఎంత కరెంటు ఖర్చవుతుంది తెలుసా?

AC Temperature: ఎండల్లో ఏసీల వినియోగం ఎక్కువైంది. కూలర్లు, ఏసీలు ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నారు. కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది.

Update: 2025-04-23 10:30 GMT
How Much Electricity Does AC Use at 18 degree Celsius Save Power Bill in Summer

AC: ఏసీ 18 డిగ్రీల వద్ద నడిపితే ఎంత కరెంటు ఖర్చవుతుంది తెలుసా?

  • whatsapp icon

AC Temperature: ఈ కాలంలో ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కాదు పల్లెలో కూడా ఏసీల వినియోగం ఎక్కువైంది. అయితే ఈ నేపథ్యంలో కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. అయితే 18 డిగ్రీల వద్ద ఏసీను నడిపితే ఎంత విద్యుత్ ఖర్చవుతుంది? 24 లేదా 27 డిగ్రీల వద్ద ఏసీను నడిపితే నెలవారీ బిల్లు ఎంత మీకు తెలుసా ?

సాధారణంగా వేసవికాలంలో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తాయి. అంటే కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు నడుపుతూనే ఉంటాం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏసీలు వినియోగిస్తాం. దీనివల్ల ఖర్చు కూడా బోలెడు అవుతుంది. అయితే ఏసీ సరైన పద్ధతిలో వినియోగిస్తే విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం చాలా సులభం.

మీ ఇంటి ఉష్ణోగ్రతను బట్టి ఏసీ ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవాలి. తద్వారా విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. 18 డిగ్రీలు 24 డిగ్రీలు ఉష్ణోగ్రత వద్ద ఏసీ ని నడుపుతే ఎక్కువ వస్తుందా? తక్కువ వస్తుందా ?

18 డిగ్రీల వద్ద ఏసీ పెడితే కంప్రెసర్ ఎక్కువ సేపు నడవాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. 24 డిగ్రీల వద్ద కంప్రెసర్ తక్కువ సమయం పాటు నడుస్తుంది. దీనివల్ల మీకు విద్యుత్ బిల్లు కూడా ఆదా అవుతుంది. ఇది మన శరీర ఉష్ణోగ్రత కూడా సరైంది. 18 డిగ్రీల వద్ద 13 కిలో వాట్ విద్యుత్తు వినియోగం అయితుంది. అంటే నెలవారీ కరెంటు ఖర్చు దాదాపు రూ.1800 వస్తుంది.

24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద విద్యుత్ ఉష్ణోగ్రతను సెట్ చేస్తే నెలకి అయ్యే ఖర్చు రూ.1400 అవుతాది. 20 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నడిపిస్తే 9 కిలోలు వాట్స్ అంటే రూ.1200 ఖర్చు అవుతుంది. అంటే 18, 24 డిగ్రీల వద్ద నడుస్తున్న ఏసీ నెల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 27 డిగ్రీల వద్ద నడిచే ఏసీ కరెంట్ బిల్లు తక్కువే వస్తుంది. దీంతో పాటు సీలింగ్ ఫ్యాన్ కూడా చిన్నగా నడిపిస్తే త్వరగా రూమ్ చల్లబడిపోతుంది.

Tags:    

Similar News