OnePlus 13T: వన్‌ప్లస్ 13T ఫోన్ వచ్చేసిందోచ్.. డిస్‌ప్లే సూపరో సూపర్.. బ్యాటరీ ఎంతో తెలుసా..?

OnePlus 13T: వన్‌ప్లస్ 13T ఇండియాలో లాంచ్ కాకముందే, దానిలోని అనేక అద్భుతమైన ఫీచర్లు వెల్లడయ్యాయి.

Update: 2025-04-25 07:49 GMT
oneplus 13t launch with 6,260mAh battery  price and specifications

OnePlus 13T: వన్‌ప్లస్ 13T ఫోన్ వచ్చేసిందోచ్.. డిస్‌ప్లే సూపరో సూపర్.. బ్యాటరీ ఎంతో తెలుసా..?

  • whatsapp icon

OnePlus 13T: వన్‌ప్లస్ 13T ఇండియాలో లాంచ్ కాకముందే, దానిలోని అనేక అద్భుతమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 24న చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ డిస్ప్లేకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ స్వయంగా పంచుకుంది. వన్‌ప్లస్ 13Tఅనేది OnePlus 13 స్మాల్ వెర్షన్ అవుతుంది. శక్తివంతమైన బ్యాటరీ, గొప్ప డిస్ప్లే, కొత్త చిప్‌సెట్‌తో ఈ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

OnePlus 13T Display

వన్‌ప్లస్ 13Tలో 1.5K (1216×2640 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.32-అంగుళాల ఫ్లాట్ OLED స్క్రీన్‌ ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 460ppi పిక్సెల్ డెన్సిటీ, 100శాతం DCI-P3 కలర్ కవరేజ్‌తో వస్తుంది. దీనితో పాటు, HDR10+, HDR, వివిడ్, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది, ఇది వీడియో, గేమింగ్ అనుభవాన్ని గొప్పగా చేస్తుంది.

ఈ ఫోన్ డిస్ప్లేను తాము అభివృద్ధి చేసిన డిస్ప్లే టెక్నాలజీపై తయారు చేసినట్లు వన్‌ప్లస్ పేర్కొంది. ఇది P2 డిస్ప్లే చిప్, బ్రైట్ ఐ ప్రొటెక్షన్ 2.0’ టెక్నాలజీతో ఉంది, ఇది కళ్ళపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. దీర్ఘకాలిక ఉపయోగంలో కూడా సౌకర్యాన్ని అందిస్తుంది.

వన్‌ప్లస్ 13T లో ‘సన్ డిస్ప్లే’ మోడ్ ఇచ్చారు. సూర్యకాంతిలో కూడా స్క్రీన్‌ను సులభంగా చదవచ్చు. దీనితో పాటు, రెయిన్ టచ్ 2.0, 'గ్లవ్ టచ్' ఫీచర్స్ కూడా ఉన్నాయి. వర్షంలో కూడా ఫోన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.

కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ కూడా బాగున్నాయి. 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది, దీనిలో ఒక కెమెరా 2x ఆప్టికల్ జూమ్, 4x లాస్‌లెస్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6,260mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15 పై రన్ అవుతుంది. గేమింగ్ కోసం Wi-Fi G1 చిప్‌ ఉంటుంది. ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.

Tags:    

Similar News