Samsung Galaxy M56 5G Launch: భారత్‌కి వచ్చేస్తోంది.. సామ్‌సంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూశారా..!

Samsung Galaxy M56 5G Launch: దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ సామ్‌సంగ్ "Galaxy M56 5G"ని త్వరలో భారత్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.

Update: 2025-04-12 05:23 GMT
Samsung Galaxy M56 5G Launch Confirmed Expected Date Price Features

Samsung Galaxy M56 5G Launch: భారత్‌కి వచ్చేస్తోంది.. సామ్‌సంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూశారా..!

  • whatsapp icon

Samsung Galaxy M56 5G Launch: దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ సామ్‌సంగ్ "Galaxy M56 5G"ని త్వరలో భారత్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కూడా వెల్లడైంది. ఇది గత సంవత్సరం ప్రారంభించిన గెలాక్సీ M55 5జీ అప్‌గ్రేడ్ మోడల్ అవుతుంది. ఈ ఫోన్ గత ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఫోన్ డిజైన్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ మందం మునుపటి మోడల్ కంటే 30 శాతం సన్నగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అనేక సర్టిఫికేషన్, బెంచ్‌మార్కింగ్ సైట్‌లలో కనిపించింది. రండి.. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Galaxy M56 5G Launch Date And Price

ఈ సామ్‌సంగ్ ఫోన్ ఏప్రిల్ 17న భారతదేశంలో లాంచ్ అవుతుంది. కంపెనీ తన X హ్యాండిల్ ద్వారా ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ ఫోన్ మందం 7.2మిమీ, ఇది మునుపటి మోడల్ 7.8మిమీ మందం కంటే చాలా తక్కువ. ఇది కాకుండా ఈ సామ్‌సంగ్ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో కూడా టీజ్ చేశారు. కంపెనీ ఫోన్ మైక్రోసైట్‌ను కూడా రూపొందించింది. నివేదిక ప్రకారం.. దీని ధర రూ. 20,000 నుండి రూ. 30,000 వరకు ఉండచ్చు.

Galaxy M56 5G Features And Specifications

ఈ సామ్‌సంగ్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్ డిస్ప్లేతో రావచ్చు. దీనిలో కంపెనీ sAMOLED+ డిస్ప్లేని ఉపయోగించవచ్చు. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఫోన్ డిస్‌ప్లే చుట్టూ 36 శాతం సన్నని బెజెల్స్ ఉంటాయి. ఇది కాకుండా, ఫోన్ వెనుక ప్యానెల్‌లో కొత్త కెమెరా మాడ్యూల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంటుది. దీని కెమెరా మాడ్యూల్ పిల్ ఆకారంలో ఉంటుంది. దీనిలో మెయిన్, అల్ట్రా వైడ్, మాక్రో కెమెరాలను అందించచ్చు.

Samsung Galaxy M56 5G Camera

సామ్‌సంగ్ గెలాక్సీ M56 5Gలో 50MP మెయిన్ OIS కెమెరా ఉంటుంది. ఇది కాకుండా, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాను ఇందులో అందించవచ్చు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 12MP కెమెరా ఉంటుంది. ఇది కాకుండా, ఫోన్ కెమెరా HDR ఫీచర్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి, ఇందులో ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ SM-M566B. ఇది ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో ఉంటుంది. మొబైల్‌లో 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7 ఆధారంగా OneUI 15 పై పనిచేస్తుంది.

Tags:    

Similar News