Realme GT 6T 5G: మీ మైండ్ బ్లాక్ అవుతుంది.. రియల్‌మీ 5జీ ఫోన్‌పై రూ.9 వేల డిస్కౌంట్..!
Realme GT 6T 5G: మొబైల్ లవర్స్‌కు ఓ తీపివార్త. టెక్ మేకర్ రియల్‌మీ తన 5జీ ఫోన్ ధరను మళ్లీ తగ్గించింది.

Realme GT 6T 5G: మీ మైండ్ బ్లాక్ అవుతుంది.. రియల్‌మీ 5జీ ఫోన్‌పై రూ.9 వేల డిస్కౌంట్..!
Realme GT 6T 5G: మొబైల్ లవర్స్‌కు ఓ తీపివార్త. టెక్ మేకర్ రియల్‌మీ తన 5జీ ఫోన్ ధరను మళ్లీ తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం రూ.9,000 చవక ధరకే విక్రయిస్తుంది. ఇప్పుడు Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌పై ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తుంది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ నుంచి ఈ మొబైల్‌ను ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్ బేస్ ధర, ఆఫర్స్, పీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Realme GT 6T 5G Offers
రియల్‌మీ జీటీ 6టీ 5జీ 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 32,999కి విడుదల చేసింది. కంపెనీ గతంలో దీని ధరను రూ.4,000 తగ్గించింది. ప్రస్తుతం రూ.5000 కూపన్ తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపుతో మీరు ఈ ఫోన్‌ను లాంచ్ ధర కంటే రూ.9 వేల తక్కువకే కొనుగోలు చేయచ్చు.
ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్‌లో రూ.5,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా, రూ. 5000 తగ్గింపు పొందడానికి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అవసరం లేదు. కస్టమర్లందరికీ ఈ డిస్కౌంట్ లభిస్తుంది . ఈ-కామర్స్ సైట్‌లో ఫోన్‌పై అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత Realme GT 6T ఫోన్‌ను కేవలం రూ. 23,998కి కొనుగోలు చేయచ్చు.
Realme GT 6T 5G Features
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 2,780 x 1,264 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లేకి కార్నింగ్ గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారంగా రియల్‌మీ UI 5తో పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 732 GPU కూడా ఉంది. ఈ మొబైల్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది.
ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండవ కెమెరాలో 8 మెగాపిక్సెల్, సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. స్మార్ట్‌ఫోన్ 5,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. ఫోన్‌ని వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్డ్ చేయడానికి IP65 రేటింగ్ ఫీచర్ ఇచ్చారు. కనెక్టివిటీ ఎంపికలలో 5G బ్యాండ్, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, జీపీఎస్, యూఎస్‌బి 2.0 సి పోర్ట్ మొదలైనవి ఉన్నాయి.