iQOO Z10 Turbo: యాహూ.. ఐకూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ధర చాలా తక్కువ..!
iQOO Z10 Turbo: ఐక్యూ తన రాబోయే Z10 టర్బో సిరీస్ గురించి ఉత్సాహాన్ని పెంచింది. ఈ సిరీస్ ప్రో మోడల్ టీజర్‌ను కంపెనీ ఇటీవల పంచుకుంది.

iQOO Z10 Turbo: యాహూ.. ఐకూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ధర చాలా తక్కువ..!
iQOO Z10 Turbo: ఐక్యూ తన రాబోయే Z10 టర్బో సిరీస్ గురించి ఉత్సాహాన్ని పెంచింది. ఈ సిరీస్ ప్రో మోడల్ టీజర్‌ను కంపెనీ ఇటీవల పంచుకుంది. టీజర్‌లో ఫోన్ ఆరెంజ్ కలర్ వెనుక ప్యానెల్, డ్యూయల్ కెమెరా సెటప్‌ను చూపించింది. ఈ సిరీస్ ఏప్రిల్‌లో చైనాలో విడుదల చేయనుంది. అంతేకాకుండా ప్రీ-బుకింగ్ ప్రారంభించింది.
iQOO Z10 Turbo Series Features
నివేదికల ప్రకారం.. iQOO Z10 టర్బో సిరీస్ రెండు వేరియంట్లలో రావచ్చు - స్టాండర్డ్, ప్రో. స్టాండర్డ్ మోడల్ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చు, అయితే ప్రో వెర్షన్ కొ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తుంది. రెండు మోడల్స్‌లో 6.78-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే ఉంటాయి, ఇది 144Hz అధిక రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే.. స్టాండర్డ్ Z10 టర్బోకు పెద్ద 7500/7600mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వచ్చు, అయితే ప్రో మోడల్ 7000mAh బ్యాటరీతో 120W అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కెమెరా విభాగంలో 50మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్. 16MP సెల్ఫీ కెమెరాను అందించవచ్చు.
iQOO Z10 Turbo Series Price
ఐక్యూ ఈ సిరీస్ కోసం కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది, ఇందులో 2100 యువాన్ల (సుమారు రూ. 25,000) వరకు ఆశ్చర్యకరమైన బహుమతి, 3 సంవత్సరాల బ్యాటరీ గ్యారెంటీ,1 సంవత్సరం పొడిగించిన వారంటీ ఉన్నాయి. అయితే, ఈ సిరీస్ దేశంలో ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. ఈ సిరీస్ భారతదేశంలో ప్రారంభమైతే, దీని ధర రూ.25,000 నుండి రూ.30,000 మధ్య ఉండవచ్చు.