Who is Ashwani Kumar: ముంబై ఇండియన్స్ రాత మార్చిన అశ్వని కుమార్... ఎవరీ యంగ్ బాయ్?

Update: 2025-04-01 08:18 GMT

MI vs KKR Match: ముంబై ఇండియన్స్ రాత మార్చిన అశ్వని కుమార్... ఎవరీ యంగ్ బాయ్?

Ashwani Kumar's performance in MI vs KKR match highlights: అశ్వని కుమార్... సోమవారం నాటి ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌తోనే తొలిసారిగా ఐపిఎల్‌లోకి అడుగుపెట్టాడు. కానీ ఫస్ట్ మ్యాచ్‌తోనే ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. గతంలో ఐదుసార్లు ఐపిఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ 18వ సీజన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్స్ పట్టికలో అట్టడుగుకుపడిపోయింది. కానీ వాంఖడే స్టేడియంలో కోల్‌కతాతో మ్యాచ్‌లో ఆ జట్టు అద్భుతమే చేసింది. ఆ అద్భుతంలోనూ ప్రత్యర్థులను తక్కువ స్కోర్‌కే ఔట్ చేయడంలో అద్భుతమైన పాత్ర పోషించిన బౌలర్ అశ్వని కుమార్.

ఐపిఎల్ కెరీర్లో ఫస్ట్ బంతికే కోల్ కతా కెప్టేన్ అయిన అజింక్య రహానే లాంటి సీనియర్ వికెట్ పడగొట్టాడు. అంతటితో అతడి వికెట్ల వేట ఆగలేదు. వెంటవెంటనే రింకూ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ మనీష్ పాండే, ఆండ్రూ రసెల్ వంటి కీలకమైన ఆటగాళ్ల వికెట్స్ తీసి ఔరా అనిపించాడు. అంతేకాదు... ఐపిఎల్ ఆరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా అశ్వని కుమార్ చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా‌ను తక్కువ స్కోర్‌కే చాప చుట్టేసేలా చేయడంలో అశ్వని కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్స్ పట్టికలో అట్టడుగు నుండి 6వ స్థానానికి ఎదిగి తమ స్థానాన్ని మెరుగు పర్చుకుంది.

ఇంతకీ ఎవరీ అశ్వని కుమార్?

పెద్దగా ఫేమ్‌లో లేని మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడంలో ముంబై ఇండియన్స్‌కు మంచి ప్రతిభ ఉందనే పేరుంది. గతంలో జస్‌ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్య, కృనాల్ పాండ్య, రీసెంట్‌గా తిలక్ వర్మ.. ఇలా ఎంతోమంది ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పుడు అశ్వని కుమార్‌కు కూడా ముంబై ఇండియన్స్ అలాంటి అవకాశమే ఇచ్చింది.

చండీగఢ్ సమీపంలోని ఝంజేరి అశ్వని కుమార్ స్వస్థలం. గతేడాది నవంబర్ లో జరిగిన వేలంలో అశ్వని కుమార్ ను రూ. 30 లక్షల కనీస ధరలోనే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

అప్పుడే ముంబై ఇండియన్స్ కంట్లో పడ్డాడు

2019 నుండి క్రికెట్ ఆడుతున్న అశ్వని కుమార్ ఇప్పటివరకు పెద్దగా లైమ్‌లైట్‌లో లేడు. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ ఈ యువ బౌలర్‌ను నమ్మడానికి కారణం గతేడాది జరిగిన షేర్-ఎ-పంజాబ్ ట్రోఫీ. టీ20 ఫార్మాట్‌లో పంజాబ్ క్రికెట్ అసోసియేయన్ నిర్వహిస్తోన్న రెండో సీజన్ అది. అగ్రి కింగ్స్ నైట్స్ జట్టు తరుపున ఆడిన 6 మ్యాచ్‌ల్లో 21.27 సగటుతో 11 వికెట్స్ తీశాడు. అందుకే ముంబై ఇండియన్స్ జట్టు ఈ యువ బౌలర్‌ను నమ్మి కొనుగోలు చేసింది. కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచిన అశ్వని కుమార్ భవిష్యత్‌లో ఆ జట్టులో మరింత కీలక స్థానంలో ఉండే అవకాశం లేకపోలేదు.

కోల్‌కతాను 116 లాంటి అత్యల్ప స్కోర్‌కే ఔట్ చేయడంలో అశ్వని కుమార్ తరువాత ముంబై ఇండియన్స్ బౌలర్లలో దీపక్ చాహర్ (2/19), ట్రెంట్ బోల్ట్ 1/23, హార్ధిక్ పాండ్య (1/10), మిచెల్ శాంటర్ (1/17), విగ్నేష్ పుతూర్ (1/21) సమష్టి కృషి కనబర్చారు.

ఆ తరువాత లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రికెల్టన్ 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. రికెల్టన్ శ్రమకు సూర్య కుమార్ యాదవ్ తోడయ్యాడు. 9 బంతుల్లో 27 పరుగులు రాబట్టి మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో జట్టును గెలిపించారు.

Tags:    

Similar News