
IPL 2025 : సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. కానీ ఆ జట్టులోని ఒక ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు మాత్రం భారీ జరిమానా పడింది. అంతేకాదు.. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా వేశారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఐపీఎల్ రూల్స్ తప్పడం వల్లే మాక్స్‌వెల్‌కు ఈ శిక్ష వేశారు. అయితే ఈ సీజన్‌లో ఇలాంటి తప్పు చేసి ఫైన్ కట్టిన మొదటి ప్లేయర్ మాత్రం అతనేం కాదు. మాక్స్‌వెల్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేశారు.
తప్పు ఒప్పుకున్న మాక్స్‌వెల్
ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ గ్లెన్ మాక్స్‌వెల్ గురించి వివరాలు తెలిపింది. మాక్స్‌వెల్ తన తప్పు ఒప్పుకున్నాడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. లెవెల్ 1 కింద అతన్ని దోషిగా తేల్చారు. మ్యాచ్ రిఫరీ ముందు మాక్స్‌వెల్ తన తప్పును అంగీకరించడంతో ఈ విషయంలో ఇంకెలాంటి వాదనలు లేదా విచారణ ఉండదని స్పష్టం చేశారు. లెవెల్ 1 కింద దోషిగా తేలితే మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయమే ఫైనల్.
మాక్స్‌వెల్ ఒక్కడే కాదులెండి
లెవెల్ 1 కింద శిక్ష పడిన వాళ్లలో మాక్స్‌వెల్ ఈ ఐపీఎల్ 2025 సీజన్‌లో మొదటి ప్లేయర్ కాదు. అతని కంటే ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న దిగ్విజయ్ రాఠీకి రెండుసార్లు ఫైన్ పడింది. మొదటిసారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, రెండోసారి 50 శాతం ఫైన్ వేశారు. దిగ్విజయ్‌తో పాటు ఇషాంత్ శర్మ కూడా లెవెల్ 1 కింద దోషిగా తేలడంతో అతనికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేశారు.
సీఎస్‌కేపై మాక్స్‌వెల్ పర్ఫార్మెన్స్
మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే బ్యాట్‌తో పెద్దగా పరుగులేం చేయలేదు. సీఎస్‌కేపై పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన ఈ ఆల్‌రౌండర్ 2 బంతులు ఆడి కేవలం 1 పరుగే చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. బౌలింగ్‌లో మాత్రం మాక్స్‌వెల్ ఒక వికెట్ తీశాడు కానీ అది చాలా విలువైన వికెట్. ఎందుకంటే మంచి ఫామ్‌లో ఉన్న సీఎస్‌కే బ్యాటర్ రచిన్ రవీంద్ర వికెట్‌ను మాక్స్‌వెల్ తీశాడు.