MI vs RCB: దటీజ్ విరాట్ కోహ్లీ.. ఇండియాలో ఓకే ఒక్కడు.. ముంబైపై మ్యాచ్‌లో సూపర్బ్ రికార్డు!
MI vs RCB: ఈ ప్రదర్శనతో కోహ్లీ తన కాన్సిస్‌టెన్సీని మరోసారి రుజువు చేశాడు. ఇప్పటికీ ఈ ఫార్మాట్‌లో దూకుడును తగ్గకుండా, నైపుణ్యంతో పాటు అనుభవాన్ని కూడా రంగంలో చూపిస్తున్నాడు.

MI vs RCB: దటీజ్ విరాట్ కోహ్లీ.. ఇండియాలో ఓకే ఒక్కడు.. ముంబైపై మ్యాచ్‌లో సూపర్బ్ రికార్డు!
MI vs RCB: విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో మరో శిఖరాన్ని అధిరోహించాడు. టీ20 ఫార్మాట్‌లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. కానీ ఈ ఘనతను అందుకున్న వేగవంతమైన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సోమవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17వ పరుగుతో ఈ గణాంకాన్ని అందుకున్నాడు.
ఇంతవరకు టీ20 క్రికెట్ చరిత్రలో 13,000 పరుగుల మార్క్‌ను అందుకున్న వారు క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్. కోహ్లీ ఇప్పుడు వీరి సరసన చేరాడు. ఈ జాబితాలో గేల్ తర్వాత అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నదే కోహ్లీ. గేల్‌కు ఇది సాధించడానికి 381 ఇన్నింగ్స్ పట్టింది. అటు కోహ్లీ 386వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. మిగతా ముగ్గురి గణాంకాలు చూస్తే, హేల్స్‌కి 474, మాలిక్‌కి 487, పొలార్డ్‌కి 594 ఇన్నింగ్స్‌లు పట్టాయి. వాస్తవానికి వీరితో పోలిస్తే కోహ్లీని చూసి అతడిలో బ్యాటింగ్ కచ్చితత్వం ఎంత ఉన్నదో స్పష్టమవుతుంది.
ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన ఓవర్‌లో అద్భుతమైన కవర్ డ్రైవ్‌తో కోహ్లీ మైలురాయిని అందుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి 19 బంతుల్లోనే 36 పరుగులు చేసి చక్కగా నిలిచాడు. మ్యాచ్ ఆరంభంలో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, మొదట బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ శుభారంభాన్నిచ్చాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:
--> క్రిస్ గేల్ - 14,562
--> అలెక్స్ హేల్స్ - 13,610
--> షోయబ్ మాలిక్ - 13,557
--> కీరన్ పొలార్డ్ - 13,537
--> విరాట్ కోహ్లీ - 13,000+
13,000 పరుగులు చేరిన వేగవంతమైన ఆటగాళ్లు:
క్రిస్ గేల్ - 381 ఇన్నింగ్స్
విరాట్ కోహ్లీ - 386 ఇన్నింగ్స్
అలెక్స్ హేల్స్ - 474 ఇన్నింగ్స్
షోయబ్ మాలిక్ - 487 ఇన్నింగ్స్
కీరన్ పొలార్డ్ - 594 ఇన్నింగ్స్