Jasprit Bumrah: అదుపుతప్పుతున్న బుమ్రా.. నీకు కోపం ఎక్కువైంది బ్రో!
Jasprit Bumrah: క్రికెట్‌లో, అందులోనూ IPLలోనూ అగ్రెషన్ అవసరమే. కానీ, అది మితి మీరకూడదు. రేపు విరాట్ కోహ్లీ సిక్స్‌లుపై సిక్స్‌లు కొడితే, బుమ్రా ఇదే రేంజ్‌లో గొడవకి దిగుతాడా?

Jasprit Bumrah: అదుపుతప్పుతున్న బుమ్రా.. నీకు కోపం ఎక్కువైంది బ్రో!
Jasprit Bumrah: సలార్‌లో ప్రభాస్‌కి, KGFలో యాష్‌కి, జైలర్‌లో రజనీకాంత్‌కి... ఇలా వీరికి పడినన్ని ఎలేవేషన్లకు పదింతలు పడటానికి బూమ్ బూమ్ బుమ్రా అర్హుడు. టీమిండియాలోకి అన్ని ఫార్మాట్లలలో సత్తా చూపించే ఏకైక ఆటగాడు బుమ్రా. జట్టు బాగు కోసం తన శరీరాన్ని సైతం ఎన్నో సార్లు పణంగా పెట్టి మరి పని చేసిన బుమ్రా.. ఫ్యూచర్ టెస్ట్ కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మ లాగే కూల్ కస్టమర్, అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం బుమ్రా సొంతం. గంభీర్ లాంటి కోచ్‌కి అంత కంటే ఏం కావాలి? గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా బాలెన్సుడ్‌గా ఉండటం బుమ్రా స్టైల్. డీలా పడ్డ టీమ్‌మెట్స్‌ను చాలా సార్లు ఓదారుస్తూ కనపడే బుమ్రా అంటే.. టీమిండియాలోనే కాదు.. ముంబై ఇండియన్స్ డగ్ అవుట్‌లోను అందరికి ఇష్టమే. ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ గా పేరు పొందిన బుమ్రా, బ్యాటర్‌లని తన చురుకైన యార్కర్‌లతో ఇబ్బంది పెట్టి అవుట్ చేస్తూ ఉంటాడు. కానీ, ఈ సారి IPLలో ఇలాంటి లెజెండరీ బౌలర్‌రే ఇద్దరు బ్యాటర్లు చుక్కలు చూపించారంటే మీరు నమ్ముతారా?
ఉప్పల్‌లో SRHతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ అభినవ్ మనోహర్ బుమ్రా వేసిన ఫుల్ లెంగ్త్ బాల్‌ని, కవర్స్ మీదుగా బౌండరీ దాటించాడు. అంతే కాదు.. తాను ఆడిన షాట్ తనకే నచ్చి.. ఆ ఫోజులో అలా నిలబడిపోయిన అభినవ్‌ని చూసి బుమ్రా ఇగో హర్ట్ అయింది. అంతే.. మళ్లీ బౌలింగ్ చెయ్యడానికి తిరిగొచ్చిన బుమ్రా.. స్ట్రెయిట్‌గా అభినవ్ బాడీ లక్ష్యంగా బాల్ విసిరాడు. దీంతో, అభినవ్ నొప్పితో కిందపడిపోయాడు. కడుపు భాగంలో బాల్ తగలడంతో కొద్దీ సేపు ఇబ్బంది పడ్డ మనోహర్ ని కనీసం బుమ్రా ఎలా ఉంది అని కూడా అడగలేదు. వాడికేమైతే నాకేంటి అన్న రేంజ్‌లో కనీసం లుక్ కూడా ఇవ్వకుండా తలా తిప్పుకుని తన బౌలింగ్ పోజిషన్‌కి వెళ్లిపోయిన బుమ్రాను చూసి అభిమానులు కంగుతిన్నారు. మరి ఆ మాత్రం మానవత్వం కూడా లేకుండా ఎలా ఉంటారంటూ బుమ్రాకి చివాట్లు పెడుతున్నారు. తాను చాలా కూల్ అని, తనకి కోపమే రాదన్నట్టుగా కనపడే బుమ్రా, బ్యాటర్ సిక్స్ కొట్టడాన్నిమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. అభినవ్ మనోహర్‌తోనే కాదు, ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్‌తో కూడా ఇలాంటి సంఘటనే రిపీట్ అయ్యింది. ముంబైతో మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడిన కరుణ్.. బుమ్రాని చితకొట్టాడు. దీంతో ఎప్పుడు లేని ఆగ్రహంతో ఊగిపోయిన బుమ్రా.. కరుణ్‌తో గొడవపడ్డాడు. మ్యాచ్ ముగిశాక కూడా ఇది కంటిన్యూ అవ్వడం.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఏ మాత్రం మింగుడుపడలేదు.
మహా మహా బ్యాటర్లకే చెమటలు పట్టించిన బుమ్రా.. అభినవ్ మనోహర్, కరుణ్ నాయర్ తనని కోడుతుంటే ఎందుకింత ఫీల్ అయిపోతున్నాడో అర్థంకావడంలేదు. తనని తాను తిట్టుకుంటే పర్లేదుగాని, అవతల బ్యాటర్‌పై కోపం పెట్టేసుకుని ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి మహాప్రభో.. అంటూ బుమ్రాహ్ ఫాన్స్ ముక్కున వేలేసుకున్నారు. క్రికెట్‌లో, అందులోనూ IPLలోనూ అగ్రెషన్ అవసరమే. కానీ, అది మితి మీరకూడదు. రేపు విరాట్ కోహ్లీ సిక్స్ లు పై సిక్స్ లు కొడితే, బుమ్రా ఇదే రేంజ్ లో గొడవ కి దిగుతాడా? ఏమో, ఆ డ్రామా చూసే అవకాశం మనకి రావచ్చేమో!!