Sachin Tendulkar Birthday: విరాట్ కోహ్లీ వర్సెస్ సచిన్ టెండూల్కర్.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయ్

Sachin Tendulkar Birthday: వంద సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు. సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అనేక గొప్ప రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నారు. ఆయన నెలకొల్పిన కొన్ని రికార్డులను ఏ బ్యాట్స్‌మెన్ బద్దలు కొట్టడం అసాధ్యం. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ ఆయనే. పరుగుల పరంగా కూడా ఆయన ఇతర క్రికెటర్ల కంటే చాలా ముందున్నారు. అలాగే 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్రపంచంలోని ఏకైక ఆటగాడు కూడా ఆయనే. ఆదాయం విషయానికి వస్తే.. రిటైర్ అయినప్పటికీ సచిన్ ఆదాయంలో ఎలాంటి తగ్గుదల లేదు. ఇప్పటికీ విరాట్ కోహ్లీ వంటి అత్యంత పాపులారిటీ పొందిన ప్రస్తుత తరం క్రికెటర్ల కంటే ఆదాయంలో ముందున్నారు.
రూ.1250 కోట్ల ఆస్తులు కలిగిన మాస్టర్ బ్లాస్టర్
గురువారం, ఏప్రిల్ 24న 52 ఏళ్లు పూర్తి చేసుకున్న సచిన్, సంపాదన విషయంలో ఇప్పటికీ ముందున్నాడు. మీడియా కథనాల ప్రకారం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నికర విలువ దాదాపు 1250 కోట్ల రూపాయలు. సచిన్ టెండూల్కర్ టీమ్ ఇండియా కాకుండా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. అంతేకాకుండా, ఆయన అనేక ప్రకటనలలొ నటించారు.. నటిస్తున్నారు. సచిన్ రిటైర్ అయినప్పటికీ, పెద్ద పెద్ద బ్రాండ్లు ఇప్పటికీ ఆయన పై నమ్మకం ఉంచుతున్నాయి. అందుకే ఈ కంపెనీల ప్రకటనల్లో సచిన్ ఎక్కువగా కనిపిస్తాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆయన ఏటా 20-22 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు.
అంతేకాకుండా, ఆయన వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన క్లాతింగ్ వ్యాపారం ప్రసిద్ధి చెందింది. ఆయన బ్రాండ్ ట్రూ బ్లూ అరవింద్ ఫ్యాషన్ బ్రాండ్స్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్. ఇది 2016లో ప్రారంభించారు. 2019లో ట్రూ బ్లూ అమెరికా, ఇంగ్లాండ్ లో కూడా ప్రారంభించారు. అంతేకాకుండా, మాస్టర్ బ్లాస్టర్ రెస్టారెంట్ వ్యాపారంలో కూడా ఉన్నారు. ముంబై, బెంగళూరులలో సచిన్, టెండూల్కర్స్ పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి.
1050 కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన కింగ్ కోహ్లీ
విరాట్ కోహ్లీ విషయానికి వస్తే, మీడియా కథనాల ప్రకారం ఆయన నికర విలువ దాదాపు 1050 కోట్ల రూపాయలు. విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా కాకుండా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడతాడు. అలాగే విరాట్ కోహ్లీ ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అంతేకాకుండా, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా కూడా కోట్లాది రూపాయలు ఆర్జిస్తాడు. సచిన్ మాదిరిగానే విరాట్ కోహ్లీ కూడా రెస్టారెంట్ చైన్ నుండి ఫ్యాషన్ బ్రాండ్ వరకు వివిధ వ్యాపారాలలో తనదైన ముద్ర వేశాడు