Shreyas Iyer: అయ్యర్‌కు బీసీసీఐ వెన్నుపోటు.. ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు భయ్యా!

Update: 2025-04-22 15:03 GMT
Shreyas Iyer: అయ్యర్‌కు బీసీసీఐ వెన్నుపోటు.. ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు భయ్యా!
  • whatsapp icon

కష్టపడింది ఒకరు.. దాని ఫలితం అనుభవించేది మరొకరు. నీ టెక్నిక్‌లో లోపాలున్నాయని టీమ్‌లో నుంచి తోసేస్తే.. నిరుత్సాహ పడకుండా, చెమటోడ్చి.. తన ఆటని మార్చుకొని మరీ మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన ఘనత టీమిండియా ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ది. భారత్‌ జట్టుకు రెండు టోర్నమెంట్‌లు అందించినా.. అతడిని దురదృష్టం మాత్రం వెక్కిరిస్తూనే వచ్చింది. కొన్ని జాతకాలంతే... వెరీ బ్యాడ్ అని అల్లు అర్జున్‌ని మురళి శర్మ అన్నట్టు.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో గౌతమ్ గంభీర్ అని ఉంటాడేమో! ఇక కొద్ది నెలలుగా ప్రపంచ క్రికెట్‌లో ఏ బ్యాటర్‌ కూడా లేనంత భీకర ఫామ్‌లో చెలరేగిపోతున్న శ్రేయాస్ అయ్యర్‌ని బీసీసీఐ పెద్దగా గుర్తించలేదనే చెప్పాలి. రోహిత్, విరాట్ తప్ప మాకు ఎవ్వరు ఎక్కువ కాదని బోర్డు పెద్దలు మరోసారి చెప్పకనే చెప్పారు. బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్‌ కాంట్రాక్టు లిస్ట్‌లో ఈ విషయం బయటపడింది. గ్రేడ్ C, B, A, A+... ఇలా నాలుగు కేటగిరీల్లో ప్లేయర్లని విభజించి సంవత్సారనికి ఇచ్చే జీతాన్ని ప్రకటించింది బోర్డు.

ఇక హైయెస్ట్ కేటగిరి A+ లో విరాట్, రోహిత్, జడేజా, బుమ్రాను ఉంచిన బీసీసీఐ.... రిషబ్ పంత్, శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్య, కె.ఎల్.రాహుల్.... వీళ్ళకి గ్రేడ్-ఏ కాంట్రాక్టు ఇచ్చింది. నిజానికి గతేడాది అయ్యర్‌కి కాంట్రాక్ట్‌లో చోటు దక్కలేదు. ఇప్పుడేమో అయ్యర్‌ రేంజ్‌ వేరు. అతడిపై ఇతర కారణాలతో కాంట్రాక్ట్ ఇవ్వకపోతే ఫ్యాన్స్‌ కూడా ఊరుకోరు. అందుకే ఈసారి ఒక శత్రువుకి డబ్బులివ్వాల్సి వస్తే..జనాలు ఎంత ఏడుస్తారో, బీసీసీఐ కూడా అలానే ప్రవర్తించింది. అయ్యర్ ఆట, గెలిపించిన మ్యాచ్‌లు చూసిన ఎవరైనా, అతనికి గ్రేడ్ -ఏ ప్రమోషన్ గ్యారెంటి అనుకున్నారు. కానీ, బీసీసీఐ మాత్రం అవేమి పట్టనట్టు, అయ్యర్‌కి గ్రేడ్-బి కాంట్రాక్టు ఇచ్చి తూ తూ మంత్రంగా బిహేవ్ చేసింది. ఇదంత గతేడాది తాము చేసిన అవమానాన్ని తుడుచుకునే ప్రయత్నమే. అందుకే బీసీసీఐ అఫీషియల్స్ ఫ్యాన్స్ ఆగ్రహానికి బలయ్యారు. ఆడింది ఒకడు, క్రెడిట్ తన్నుకు పోయేది మరొకడు, ఇదేం న్యాయం బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.

ఇక ఈ మధ్య కాలంలో.. వైట్-బాల్ క్రికెట్‌లో పంత్ రెచ్చిపోయి ఆడి, మ్యాచ్ గెలిపించిన దాఖలాలు ఏమీ లేవు. టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్‌గా పేరు పొందిన రిషబ్, ఆ ఫార్మాట్‌లో కూడా తుస్సుమన్నాడు. మరి, పంత్‌కి మాత్రం గ్రేడ్-ఏ కాంట్రాక్టు అలానే ఉంచి.. శ్రేయాస్ అయ్యర్ లాంటి మణిమాణిక్యాన్ని తొక్కేయ్యడం ఎంత వరకు కరెక్ట్? టీమిండియాలో ఫేవరిటిజం ఉందన్న వాస్తవం క్రికెట్‌ని ఫాలో అవుతున్న ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. పంత్ అంటే అందరికి ఇష్టమే.. సరదాగా అందర్నీ కలుపుకోయే మనస్తత్వం ఉన్న ఆటగాడంటే అభిమానులకి ఎంత ఇష్టమో, బీసీసీఐ ఇంటర్నల్ మెంబెర్స్ కి కూడా అంతే ఇష్టం. అలా అని, ఫామ్‌లో లేకున్నా, టీం ఇండియా లో భరించడమే కాకుండా గ్రేడ్-ఏ కాంట్రాక్టు అలానే ఉంచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా అయ్యర్ ఎంత కష్టపడ్డా, మళ్ళీ కాంట్రాక్టు వచ్చేది నెక్స్ట్ ఇయరే కాబట్టి, అప్పటికైనా బీసీసీఐ మారి, అయ్యర్ ఎఫ్ఫార్ట్స్ గుర్తిస్తుందని ఆశిద్దాం. కనీసం ప్లేయర్ కాంట్రాక్టుల దగ్గరైనా బీసీసీఐ మెరిట్ చూడకుండా, ఫేవరిటిజం చూడడం ఏమాత్రం బాగోలేదని ఫ్యాన్స్‌ వాపోతున్నారు.

Tags:    

Similar News