MS Dhoni-Ashwin: అశ్విన్‌కు ధోనీ వెన్నుపోటు.. ఎంత పని చేశావ్ తలా!
MS Dhoni-Ashwin: మహీ అసహనం వ్యక్తం చేశాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకే అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఇకపై చెన్నై జట్టుపై ఏవైనా ప్రివ్యూలు, రివ్యూలు చేయబోవడంలేదని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

MS Dhoni-Ashwin: అశ్విన్‌కు ధోనీ వెన్నుపోటు.. ఎంత పని చేశావ్ తలా!
MS Dhoni-Ashwin: చెన్నై సూపర్ కింగ్స్ కి వివాదాలు కొత్తేమీ కావు. సీజన్ మొదటి మ్యాచ్ నుంచే బౌలర్ ఖలీల్ అహ్మద్ బాల్ టాంపరింగ్ చేశాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు మరోసారి జట్టు చెంతకే వివాదం చేరింది. అది కూడా తమ హోమ్ సిటీకి చెందిన రవిచంద్రన్ అశ్విన్ వల్ల. ఆట నుంచి విరమణ ప్రకటించి మళ్లీ చెన్నై జట్టులో చేరిన అశ్విన్, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సృష్టించిన వివాదంతో జట్టు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అభిమానులు ఇది అవసరమా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అశ్విన్ యూట్యూబ్ ఛానల్ గురించి క్రికెట్ అభిమానులకు పరిచయమే. రిటైర్మెంట్ అనంతరం అశ్విన్ ఆటలో అంతా అనలిస్ట్‌గా మారిపోయాడు. కోవిడ్ సమయంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా చేసిన విశ్లేషణలు, ముచ్చట్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు అదే ఛానల్ వల్ల అతనికి, చెన్నై జట్టుకు చిక్కులు తప్పడం లేదు.
ఈ ఛానల్‌లో ప్రసన్న అగోరం అనే వ్యక్తి మేజర్ ఆకర్షణగా నిలుస్తాడు. గేమ్‌ను విశ్లేషించడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. ఇటీవల ప్రసన్న చెన్నై మ్యాచ్‌పై మాట్లాడుతుండగా జడేజా, అశ్విన్ ఉన్న టీమ్‌లో నూర్ అహ్మద్ అవసరమా అని కామెంట్ చేశాడు. ఇది చెన్నై అభిమానుల్లో ఆగ్రహం రేపింది. అశ్విన్‌ను పొగిడేందుకు వేరే వీడియో చేయవచ్చుగా.. మ్యాచ్ విశ్లేషణల్లో ఎందుకని ప్రశ్నలు గుప్పించారు. పరిస్థితి అదుపు తప్పనుందనుకున్న అశ్విన్ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేశాడు.
కానీ సమస్య అంతటితో ఆగలేదు. చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడుతూ అశ్విన్ యూట్యూబ్ ఛానల్ ఉందని తనకు తెలీదని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఫ్లెమింగ్‌పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ జట్టని అభిమానుల భావన, మిగిలినవారు కేవలం పేరుకే అనుభవిస్తున్నారని కామెంట్లు వినిపించాయి. ఇక అశ్విన్ ఛానల్ విషయం ధోనీ వరకు వెళ్లిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. దీనివల్ల మహీ అసహనం వ్యక్తం చేశాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకే అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఇకపై చెన్నై జట్టుపై ఏవైనా ప్రివ్యూలు, రివ్యూలు చేయబోవడంలేదని నిర్ణయించుకున్నట్టు సమాచారం.