Tilak Varma: తిలక్‌ వర్మ దెబ్బకు నోరెళ్లబెట్టిన పాండ్యా.. ఇది తెలుగోడి సత్తా అంటే!

నిన్నటి మ్యాచ్‌లో తిలక్‌ అద్భుతంగా ఆడడంతో పాండ్యా తన స్వరాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.

Update: 2025-04-08 04:32 GMT
Hardik Pandya Tilak Varma RCB Mumbai Indians Mahela Jayawardhene

Tilak Varma: తిలక్‌ వర్మ దెబ్బకు నోరెళ్లబెట్టిన పాండ్యా.. ఇది తెలుగోడి సత్తా అంటే!

  • whatsapp icon

ఇది హైదరాబాద్‌ కుర్రాడి దెబ్బ..! ఎన్నెన్ని మాటలన్నారు భయ్యా... జిడ్డు బ్యాటింగ్‌ అని ఒకడు.. సత్తా లేదని ఇంకొకడు..! తిలక్‌ వర్మ ఒక్క మ్యాచ్‌లో డాట్‌ బాల్స్‌ ఆడితేనే చాలా రచ్చ చేశారు. ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ జయవర్దనే అయితే ఏకంగా తిలక్‌ను రిటైర్ట్‌ అవుట్‌ అవ్వాలని ఆదేశాలు జారీ చేశాడు. మ్యాచ్‌ చివరిలో ఎంతో వేదన అనుభవిస్తూ.. భరించని బాధతో తిలక్‌ నాడు గ్రౌండ్‌ను వీడాడు. నాటి లక్నోపై మ్యాచ్‌ తర్వాత ప్లేయర్‌కు అండగా నిలవాల్సిన కెప్టెన్‌ పాండ్యా సైతం తిలక్‌నే తక్కువ చేసి మాట్లాడాడు. కానీ వీళ్లందరికి తిలక్‌ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఆర్సీబీపై జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ తన టాలెంట్‌ను మరోసారి ప్రపంచానికి చూపించాడు. అప్పటికే టాపార్డర్‌ పెవిలియన్‌కి చేరిన సమయంలో మ్యాచ్‌ను అనూహ్యంగా మలుపు తిప్పాడు. చివరికి ముంబై ఓడిపోయినా ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ చూపించిన తెగింపు IPLకే హైలెట్‌గా నిలిచింది.

ఆర్సీబీపై మ్యాచ్‌లో తిలక్‌ వర్మ 29 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. అవతలి ఎండ్‌లో తనను తక్కువ చేసి మాట్లాడిన పాండ్యాను నిలబెట్టి మరీ తిలక్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. తిలక్‌ ఆడుతుంటే కెమెరాలు కోచ్‌ జయవర్దనే వైపు ఫోకస్‌ చేశాయి. ఆ సమయంలో జయవర్దనే గట్టిగా తిలక్‌ను సపోర్ట్ చేస్తూ కనిపించాడు. ఇలా తిలక్‌ను అవమానించిన వారే సపోర్ట్ చేశారు. మ్యాచ్‌ తర్వాత పాండ్యా సైతం తిలక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. గత మ్యాచ్‌లో తిలక్‌ రిటైర్ట్‌ హర్ట్‌ అవుట్‌ను సమర్థించిన పాండ్యా ఇప్పుడు కొత్త కథ చెప్పే ప్రయత్నం చేశాడు. లాస్ట్‌ మ్యాచ్‌కు ముందు తిలక్‌కు తలనొప్పిగా ఉందని.. అందుకే రిటైర్ట్‌ హర్ట్‌ అవుట్‌ చేశామని సాకు చెప్పాడు. అయితే ఇది ఏ మాత్రం నమ్మేలా లేదు. ఎందుకంటే పాండ్యాకు తిలక్‌ను అవమానించడం కొత్త విషయమేమీ కాదు. గత ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఓసారి నోరుపారేసుకున్నాడు. ఇక నిన్నటి మ్యాచ్‌లో తిలక్‌ అద్భుతంగా ఆడడంతో పాండ్యా తన స్వరాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.

మరోవైపు తిలక్‌ రిటైర్డ్‌ హర్ట్‌ అవుట్‌పై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. తిలక్‌ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో గత మ్యాచ్‌ను ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటున్నారు. తిలక్‌ను ప్లేయర్‌ను అవమానించి ముంబై ఫ్రాంచైజీ చాలా తప్పు చేసిందని వాపోతున్నారు. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఆ సమయంలో అతడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే పాండ్యాను రిటైర్ట్‌ అవుట్‌ అవ్వాలని ఎవరూ కోరలేదు. తిలక్‌ విషయంలో మాత్రం దీనికి విరుద్దంగా జరిగింది.

Tags:    

Similar News