Sai Sudharsan: సాయి సుదర్శన్ అరుదైన రికార్డు.. 8 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలు

Sai Sudharsan: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ (GT) అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. 39వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Update: 2025-04-22 04:01 GMT
Sai Sudharsan: సాయి సుదర్శన్ అరుదైన రికార్డు.. 8 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలు
  • whatsapp icon

Sai Sudharsan: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ (GT) అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. 39వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ మరోసారి తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 74 బంతుల్లో 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోరుకు పునాది వేశాడు. ఈ సీజన్‌లో సాయి సుదర్శన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఇప్పటికే 5 హాఫ్ సెంచరీలు బాదేశాడు. అంతేకాదు, ఈ సీజన్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ విజయంలో సుదర్శన్ నిలకడైన ఆట ఎంతో కీలకంగా మారింది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కూడా అతడిదే కావడం విశేషం.

సాయి సుదర్శన్ నెలకొల్పిన రికార్డు

ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 5 అర్ధ సెంచరీలు సాధించిన సాయి సుదర్శన్, ఐపీఎల్ 2025లో ఒక ప్రత్యేకమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 300కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లలో 52.12 సగటుతో 417 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాట్ నుంచి ఈ సీజన్‌లో 42 ఫోర్లు, 15 సిక్సర్లు వచ్చాయి. ఈ సీజన్‌లోని తన మొదటి మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన సుదర్శన్, రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ (63 పరుగులు) సాధించాడు. మూడో మ్యాచ్‌లో 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని ఐదో మ్యాచ్‌లో 82 పరుగులు, ఆరో మ్యాచ్‌లో 56 పరుగులు చేశాడు. ఏడో మ్యాచ్‌లో 36 పరుగులు చేసినప్పటికీ, ఎనిమిదో మ్యాచ్‌లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 52 పరుగులు చేశాడు.

2022లో గుజరాత్ టైటాన్స్‌లో చేరిక

గుజరాత్ టైటాన్స్ 2022లో సాయి సుదర్శన్‌లోని ప్రతిభను గుర్తించి కేవలం 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మూడు సీజన్లలో 1034 పరుగులు చేసి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. ఇందులో 2024 సీజన్‌లో చేసిన 527 పరుగులు కూడా ఉన్నాయి. అందుకే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు గుజరాత్ అతడిని 8.5 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకుంది. సుదర్శన్ తన ప్రదర్శనతో ఎవరినీ నిరాశపరచలేదు. ఈ ఏడాది కూడా తన మాయాజాలాన్ని కొనసాగిస్తున్నాడు. 23 ఏళ్ల సాయి సుదర్శన్ ఇప్పటికే భారత క్రికెట్ జట్టు తరపున వన్డే మరియు టీ20లలో అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. జట్టు నుంచి దూరం అయ్యాడు. కానీ, ప్రస్తుతం అతను ఆడుతున్న తీరు చూస్తుంటే, ఐపీఎల్ తర్వాత టీమిండియాలో అతనికి మళ్లీ అవకాశం వచ్చేలా ఉంది.

Tags:    

Similar News