IPL Fixing: ఐపీఎల్‌లో ఫిక్సింగ్.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!
బెట్టింగ్, ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల పాటు రాజస్థాన్, చెన్న సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలను ఆటకు దూరం పెట్టారు. ఇప్పుడు మళ్లీ రాజస్థాన్‌పై ఇదే తరహా ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.

IPL Fixing: ఐపీఎల్‌లో ఫిక్సింగ్.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!
IPL Fixing: ఐపీఎల్ అంటే ఫిక్సింగ్ అనే లాగా పరిస్థితులు మారుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లపై ప్రతీ ఏడాది ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంటోంది. రాహుల్ ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నప్పుడే 2013లో రాజస్థాన్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో చిక్కుకున్నారు. ఇప్పుడు 12ఏళ్ల తర్వాత కూడా అదే తరహా ఘటనలు జరుగుతున్నాయా అనే డౌట్స్ వస్తున్నాయి. అవును..! ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వేడెక్కించాయి. ఎప్పుడూ ఊహించనట్టు వచ్చిన ఓ పరాజయం ఇప్పుడు వివాదాల బాట పట్టించింది.
ఏప్రిల్ 19న జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 17 ఓవర్లకు 156 పరుగులు చేసి, విజయానికి కేవలం 25 పరుగులు మాత్రమే అవసరమైన దశలో మంచి స్థితిలో కనిపించింది. జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టగా, రియాన్ పరాగ్ మిడిల్ ఆర్డర్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ మ్యాచ్ అంతిమ దశలో హెట్‌మయర్, ధ్రువ్ జురేల్ వంటి అనుభవజ్ఞులు ఉన్నా చివరి ఓవర్‌లో కేవలం 6 పరుగులే వచ్చాయి. మ్యాచ్‌ను లక్నో 2 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ పరిణామాల నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్ కావాలనే ఓడిపోయిందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. పిల్లలు చూసినా ఇది సాధారణ ఓటమి కాదని, స్పష్టంగా ఏదో అనుమానాస్పదంగా జరిగిందని అభిప్రాయపడ్డారు.
ఈ ఆరోపణలు 2013లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కలకలిని గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకీత్ చావన్‌లు కేసుల్లో ఇరుక్కొన్నారు. అతి తక్కువ సమయంలో బౌలింగ్‌లో ఫిక్సింగ్ సిగ్నల్స్ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల శ్రీశాంత్ ఎన్నో సంవత్సరాలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌పై వస్తున్న ఆరోపణలు అధికారికంగా నిరూపితమవ్వాల్సి ఉంది. కానీ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం, అధికార పార్టీకి చెందిన నేతలు వ్యాఖ్యలు చేయడం ఘటనకు గంభీరతను పెంచుతోంది. ఐపీఎల్ పరిపాలన బృందం ఈ వ్యవహారంపై స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఫిక్సింగ్‌కు సంబంధించి slightest సందేహాలు కూడా వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది, లేదంటే లీగ్‌పై నమ్మకం దెబ్బతింటుంది.