Travis Head's Viral Video: సన్‌రైజర్స్ అభిమాని ఎంత బతిలాడినా సరే... నో చెప్పిన ట్రావిస్ హెడ్
SRH's Travis Head: ఫోటోకు ఫోజివ్వని ట్రావిస్ హెడ్... అంత ఆటిట్యూడ్ అవసరమా అంటున్న వ్లాగర్

Travis Head's Viral Video: ఒక్క సెల్ఫీ కోసం ట్రావిస్ హెడ్ వెంటపడ్డ సన్‌రైజర్స్ అభిమాని... చివరకు
Sunrisers Hyderabad batter Travis Head's viral video: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ మార్కెట్‌కు వెళ్లిన ట్రావిస్ హెడ్ ను చూసి అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. తాము అభిమానించే సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఆటగాడు కావడంతో ఒక సెల్ఫీ ఇవ్వాల్సిందిగా ట్రావిస్ హెడ్ కోరారు. కానీ హెడ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అయినప్పటికీ అభిమానులు ఆయన్ను విడిచిపెట్టలేదు.
సర్... మేం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎంతో అభిమానిస్తాం... మిమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తుంటాం. అలాంటి మాకు ఒక సెల్ఫీ ఇస్తే ఏమవుతుంది అని అడుగుతూ ఆయన వెనకాలే వెళ్లారు. అయినా సరే హెడ్ మాత్రం అభిమానులతో సెల్ఫీకి ఫోజు ఇవ్వలేదు.
ట్రావిస్ హెడ్ వైఖరిపై వీడియో పోస్ట్ చేసిన ఒక వ్లాగర్... అంత ఆటిట్యూట్ అవసరమా అని కామెంట్స్ చేశారు. మేం ఎంత రిక్వెస్ట్ చేసినా సెల్ఫీ ఇవ్వడం లేదు చూడండి అంటూ ఆ వ్లాగర్ అక్కడే ఉన్న వారికి కూడా వివరించడం వీడియోలో కనిపిస్తోంది. వ్లాగర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనియాంశమైంది.
ఈ వీడియోపై ట్రావిస్ హెడ్‌ను సపోర్ట్ చేస్తూ కొంతమంది కామెంట్స్ రాస్తున్నారు. సెలబ్రిటీలకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుందని, వారికి ప్రైవసీ ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం ట్రావిస్ హెడ్ ను విమర్శిస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అభిమాని అంత అభిమానంతో అడిగినప్పుడు ఒక సెల్ఫీకి ఫోజు ఇస్తే వచ్చే నష్టం ఏం లేదు కదా అనేది వారి అభిప్రాయం. మొత్తానికి క్రీజులో ప్రత్యర్ధి జట్టు బౌలర్స్ వేసే బంతులకు కూడా భయపడని హెడ్‌ను సెల్ఫీ పేరు చెప్పి పరుగెత్తించారు కదా!!