Viral video: తనను ఆడుకున్న విరాట్ కోహ్లీకి కే.ఎల్. రాహుల్ రిప్లై ఏంటో చూడండి

Update: 2025-04-28 14:30 GMT
Viral video: తనను ఆడుకున్న విరాట్ కోహ్లీకి కే.ఎల్. రాహుల్ రిప్లై ఏంటో చూడండి
  • whatsapp icon

Viral video of Virat kohli teasing KL Rahul: విరాట్ కోహ్లీ, కే.ఎల్. రాహుల్ మధ్య ఫైటింగ్ అలాగే కొనసాగుతోంది. కొన్నిసార్లు ఆ ఇద్దరి మధ్య వార్ చూసేవారిని టెన్షన్ పెడుతుంటే, ఇంకొన్నిసార్లు అది సరదాగా నవ్వుకునేలా చేస్తోంది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా అలాంటి దృశ్యాలకే వేదికైంది. దేశం తరుపున ఆడేటప్పుడు ఇద్దరూ టీమిండియా ఆటగాళ్లే అయినప్పటికీ ఈ ఐపిఎల్‌లో మాత్రం ఇద్దరూ వేర్వేరు జట్లకు చెందిన ఆటగాళ్లేనని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆదివారం ఆట ముగిసిన తరువాత రాహుల్ ను కోహ్లీ ఆట పట్టిస్తూ కనిపించాడు. కోహ్లీ టీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో బెంగళూరు స్టేడియంలో ఇదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో 93 పరుగులు చేసి రాహుల్ ఢిల్లీ జట్టును గెలిపించాడు. మ్యాచ్ విన్ అయిన తరువాత ఇది నా గ్రౌండ్ అని బ్యాట్‌తో నేలను తాకి చూపిస్తూ రాహుల్ మైదానంలోనే సంబరాలు చేసుకున్నాడు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే, ఆదివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి బెంగళూరు జట్టు ప్రతీకారం తీర్చుకుంది. విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 51 పరుగులు), కృనాల్ పాండ్య (47 బంతుల్లో 73 పరుగులు) చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ, రాహుల్ వద్దకు వెళ్తూ గతంలో రాహుల్ ఎలాగైతే ఇది నా గడ్డ అని రచ్చరచ్చ చేశాడో అచ్చం అదే తరహాలో ఇది నా గడ్డ అంటూ కోహ్లీ టీజ్ చేశాడు. అది చూసి సహచరులు నవ్వుతుండగా రాహుల్ మాత్రం కోహ్లీకి పెవిలియన్ వైపు చూపిస్తూ వెళ్లు గురూ అన్నట్లుగా దారి చూపించాడు. కానీ అంతలోనే మళ్లీ ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని సరదాగా నవ్వుల్లో మునిగిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Tags:    

Similar News