బిగ్‌బాష్ లీగ్: గ్రౌండ్‌లోనే ప్యాంట్ విప్పిన క్రికెటర్.. వీడియో వైరల్
ఉస్మాన్ అండర్‌గార్మెంట్‌లో గార్డ్ ఇబ్బందిగా మారింది.
బిగ్‌బాష్ లీగ్ 10లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఓపెనర్ ఉస్మాన్ చేసిన ఫన్నీ థింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొమ్మిదో ఓవర్ తర్వాత ఆటలో విరామం లభించింది. ఇక ఉస్మాన్ ఖాజా అండర్‌గార్మెంట్‌లో గార్డ్ ఇబ్బందిగా మారింది. దీంతో అతను డ్రెస్సింగ్ రూమ్‌కు కాల్ ఇచ్చాడు. వారు గార్డ్ తెచ్చేలోపే ఉస్మాన్ ఖాజా తన ప్యాంటును విప్పెసి అండర్‌గార్డ్‌ను తొలగించేపి సరిచేసుకునే పనిలో పడ్డాడు. ఆ లోపు సిబ్బంది తెచ్చిన కొత్త గార్డ్ వేసుకొని మళ్లీ యధావిథిగా ఫీల్డ్‌లోకి వెళ్ళాడు.
ఈ తదంగాన్ని గమనించిన అంపైర్లు, ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యానికి గురైయ్యారు. ఒక క్రికెట్ వెబ్ సైట్ తమ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. " అందరూ చూస్తుండగానే ఉస్మాన్ ఖాజా గ్రౌండ్‌లోనే తన పని కానిచ్చేశాడు" అని క్యాప్షన్ ఇచ్చింది.
ఇక మ్యాచ్‌లో తొలిత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. థండర్స్ బ్యాట్స్‌మెన్‌లో కటింగ్ (34), బిల్లింగ్స్ (34) టాప్ స్కోర్‌ర్సగా నిలిచారు. ఆ తర్వాత 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ సామ్ హీజ్లెట్ (74 ) మెరుపు ఇన్నింగ్స్ తో 19.1 ఓవర్లలో 3వికెట్లు నష్టపోయి. బ్రిస్బేన్ హీట్ సిడ్నీ థండర్స్‌పై 7 వికెట్లతో ఘన విజయం సాధించింది.