భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే

* బంగ్లాదేశ్ ఆటకట్టించేందుకు టీమిండియా వ్యూహం

Update: 2022-12-07 03:03 GMT

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే

India Vs Bangladesh: ఢాకా వేదికగా జరిగే రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఆటకట్టించేందుకు టీమిండియా తీవ్ర కసరత్తుచేసింది. తొలి వన్డేలో పరాజయంపాలవడంతో వెల్లువెత్తిన విమర్శలకు విజయంతోనే సమాధానమివ్వాలని రోహిత్ సేన బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్‌ జోరుకు కళ్లెంవేసేందుకు భారత్ బౌలింగ్ దళం బంతులతో అద్భుతాన్ని ప్రదర్శించబోతోంది. కెప్టన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్ బ్యాటును ఝళిపిస్తే భారీ స్కోరు సాధించాలనే వ్యూహంతో ఉన్నారు.

బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసినా, లక్ష్యాన్ని అధిగమించే ప్రయత్నంలో ఉన్నా తక్కువ పరుగులకు పరిమితంచేసేవిధంగా పదునైన బంతులు సంధించాలని శార్థూల్ ఠాగూర్, దీపక్ ఛాహర్, మహ్మద్ సిరాజ్, కుల్డీప్ కసరత్తు పూర్తిచేశారు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని చేజిక్కించుకున్న బంగ్లాదేశ్ జోరుమీదుంది. ఓటమిని మూటగట్టకున్న టీమిండియా మిగిలిన రెండు వన్డేల్లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతోంది.

Tags:    

Similar News