Suresh Raina: రైనా బంధువులపై దాడి కేసులో నిందితుల అరెస్టు
Suresh Raina: భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా మేనత్త కుటుంబంపై దోపిడి దొంగలు దాడి, హత్య కేసును పోలీసులు నెల రోజుల వ్యవధిలోనే చేధించారు. ఈ కేసులో ముగ్గురు సభ్యులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం చెప్పా
Suresh Raina: భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా మేనత్త కుటుంబంపై దోపిడి దొంగలు దాడి, హత్య కేసును పోలీసులు నెల రోజుల వ్యవధిలోనే చేధించారు. ఈ కేసులో ముగ్గురు సభ్యులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం చెప్పారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని, ఈ కేసులో మరో 11 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పంజాబ్ డీజీ దినకర్ గుప్తా వెల్లడించారు.
ఈ కేసును చేధించిన పోలీసులను భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభినందించాడు. తమకు జరిగిన నష్టం పూడ్చలేనిదని, కానీ ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని పేర్కొంటూ ట్విటర్ వేదికగా పంజాబ్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.
గత నెలలో సురేష్ రైనా మేనత్త కుటుంబంపై దోపిడి దొంగలు దాడి చేశారు. ఈ దాడిలో రైనా మామ, కాంట్రాక్టర్ అశోక్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. రైనా సోదరుడు కౌశల్ కుమార్ కూడా చనిపోయాడు. అయితే రైనా మేనత్త పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. ఈ విషయం తెలియగానే రైనా వెంటనే భారత్‌కు వచ్చేశాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైనా కూడా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌కు విజ్ఞప్తి చేయడంతో ఆ రాష్ట్ర పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .