IPL 2025 Purse Remaining: రిటెన్షన్ లో డబ్బు ఖర్చు చేయని ఆ జట్టు.. భారీ పర్స్ వాల్యూతో వేలంలోకి..!

IPL 2025 Purse Remaining: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కీలక ఘట్టం రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది.

Update: 2024-11-01 08:30 GMT

IPL 2025 Purse Remaining

IPL 2025 Purse Remaining: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కీలక ఘట్టం రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను గురువారం ప్రకటించాయి. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక ధర 23 కోట్లకు రిటైన్ చేయగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక అందరూ ఊహించినట్టుగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు వేలంలోకి వచ్చారు.

మొత్తం 46 మంది ఆటగాళ్లలో కేవలం రెండు ఫ్రాంచైజీలు కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తమ గరిష్ట పరిమితి ఆరు రిటెన్షన్‌లను ఉపయోగించుకున్నాయి. కనిష్టంగా పంజాబ్ కింగ్స్ ఇద్దర్ని మాత్రమే అంటిపెట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గుర్ని రిటైన్ చేసుకోగా.. ముంబై, చెన్నై, లక్నో, గుజరాత్ ఐదుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకున్నాయి. రిషబ్ పంత్ కు గుడ్ బై చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్.. నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. రిటెన్షన్ తర్వాత ఏ జట్టు దగ్గర ఎంత పర్స్ మిగిలి ఉందో చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్- రూ.55 కోట్లు

ముంబై ఇండియన్స్- రూ.45 కోట్లు

కోల్‌కత్తా నైట్ రైడర్స్- రూ.51 కోట్లు

రాజస్థాన్ రాయల్స్- రూ.41 కోట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ.45 కోట్లు

గుజరాత్ టైటాన్స్ - రూ.69 కోట్లు

రాయల్ ఛాలెంటజర్స్ బెంగళూరు - రూ.83 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ - రూ.73 కోట్లు

పంజాబ్ కింగ్స్ - రూ.110.5 కోట్లు

లక్నో సూపర్ జెయింట్స్- రూ.69 కోట్లు

Tags:    

Similar News