IPL 2020: బెంగళూరు టార్గెట్ 197

Update: 2020-10-05 17:25 GMT

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం రాత్రి దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో స్టాయినిస్‌తో పాటు రిషబ్ పంత్ (37: 25 బంతుల్లో 3x4, 2x6), పృథ్వీ షా (42: 23 బంతుల్లో 5x4, 2x6) దూకుడుగా ఆడటంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసారు. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అయితే ఈ సీజన్ మరోసారి ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టాయినిస్ (53 నాటౌట్: 26 బంతుల్లో 6x4, 2x6) హాఫ్ సెంచరీ చేశాడు. బెంగళూరు బౌలర్లలో ఇసురు ఉదాన, మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కగా, మహ్మద్ సిరాజ్ మాత్రం రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన ఫీల్డిండ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ టీంలో శిఖర్ ధావన్‌ (32: 28 బంతుల్లో 3x4) దూకుడుగా ఆడేశాడు. ఢిల్లీ వికెట్ నష్టపోకుండా పవర్ ప్లే ముగిసే సమయానికి 60 పరుగులు చేయగలిగింది. అయినా జట్టులో స్కోరు 68 ఉండగా పృథ్వీ షా వికెట్ కోల్పోయాడు. ఆ తరువాత గ్రౌండ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (11: 13 బంతుల్లో 1x4) సిక్స్ కొట్టే ప్రయత్నం చేసాడు. కానీ అతని అంచనాలు తలకిందులై వికెట్ కోల్పోయాడు. ఇక ఢిల్లీ నాలుగో వికెట్‌ కోల్పోయే సరికి పంత్-స్టాయినిస్ జోడీ 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక చివరికి హెట్‌మెయర్ (11 నాటౌట్: 7 బంతుల్లో 1x6) కూడా సిక్స్ బాదేశాడు. దాంతో ఢిల్లీ 196 పరుగుల్ని చేయగలిగింది.

Tags:    

Similar News