భారత క్రికెట్ జట్టులో సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా ఉన్న నమన్ ఓజా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల ఓజా దేశం తరఫున మూడు ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఒక టెస్టు, ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు.
ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. సుదీర్ఘకాలం పాటు క్రికెటర్‌గా కొనసాగడం గర్వంగా ఉంది. దేశానికి, రాష్ట్రానికి ఆడడం నా కల దాన్ని పూర్తి చేశా అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. 2000లో క్రికెట్‌లోకి ప్రవేశించిన ఓజా 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 17 ఏళ్ల వయసప్పుడు 2000-01లో ఓజా మధ్యప్రదేశ్ తరఫున క్రికెట్ రంగ ప్రవేశం చేశాడు. ఆ సమయంలోనే మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి రావడంతో ఓజాకు అవకాశాలు రాలేదు. ఐపీఎల్‌లో ఓజా ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు.