Naina Jaiswal: నైనా జైస్వాల్ ఫేస్‌బుక్ హ్యాక్.. పాస్‌వర్డ్ మార్చేసి..
తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందంటూ ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఖాతాను హ్యాక్ చేసిన దుండగుడు పాస్‌వర్డ్ మార్చేసి కొన్ని వీడియోలను అప్‌లోడ్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఖాతా హ్యాక్ అయిందన్న విషయం తెలుసుకున్న జైస్వాల్ మంగళవారం సిటీ సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఏసీపీ తెలిపారు.